ఒక మరణం… ఎన్నో సందేహాలు.. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారా? చనిపోలేదా? ఆయన
ఆ ప్రమాదం నుంచి బయటపడి మరికొంత కాలం జీవించారా? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నార్థకంగా నిలిచేవే? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. రోజుకో కథనం ఏవేవో కథనాలు వెలువడుతున్నాయి.. ఖండించేవాళ్ళు ఖండిస్తున్నారు.. ఆ విషయాలను ఆహ్వానించే వారు ఆహ్వానిస్తున్నారు.. కానీ ఇప్పటికీ అసలు నిజానిజాలు మాత్రం నిర్ధారణ కావడం లేదు.. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది.. ప్రభుత్వాలు రావడం.. ఈ అంశంపై విచారణ జరిపిస్తామనడం.. తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం.. ఇవన్నీ సాధారణమైపోయాయి.. తాజాగా బ్రిటన్ కు చెందిన వెబ్ సైట్ ఒకటి చంద్రబోస్ మరణానికి సంబంధించిన కొన్ని వివరాలను తన వెబ్ సైట్ లో పొండుపరించింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
సుభాష్ చంద్రబోస్ మరణం తర్వాత ఆయన కొన్ని రోజులు చైనాలో ఉన్నారన్న వాదనలను ఈ వివరాలు తిప్పికొట్టేలా ఉన్నాయి. సైట్ కథనం ప్రకారం..! బీజింగ్ లోని భారత దౌత్యవేత్త అప్పట్లో పంపించిన ఒక టెలిగ్రామ్ ను WWW.BOSEFILES.INFO అనే సైట్ లో వివరాలను వెల్లడించారు. 1945 లో విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారని దేశమంతా అనుకున్నప్పటికీ..! ఎస్.ఎం గోస్వామి అనే ఆయన అభిమాని ఒక పత్రికలో రాసిన కాలమ్ లో బోస్ బతికే ఉన్నారని చెప్తూ.. మంగోలియన్-చైనా వాణిజ్య బృందాలతో బోస్ కలిసి ఉన్న ఫోటో ఒకదానిని అందులో ప్రచురించారు. అయితే.. బీజింగ్ లోని భారత ఎంబసీ మాత్రం అది బోస్ ఫోటో కాదని తేల్చేసింది. అప్పట్లో ప్రచురితమైన ఆ ఫోటోను పరిశీలించిన చైనా విదేశాంగ శాఖ.. ఆ ఫోటో ‘పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్’ కాలేజీకి చెందిన మెడికల్ సూపరింటెండెంట్ ‘లీ కే హుంగ్’ అని పేర్కొంది. బోస్ 1945లో సోవియెట్ వెళ్లారనే ఊహగానాలను అవాస్తవాలని ఈ వెబ్ సైట్ ప్రకటించింది. తాజాగా బోస్ చైనాలో ఉండడం కూడా అవాస్తవమేనని తేల్చేసింది. మరి అసలు నేతాజీ మరణంపై ఈ మిస్టరీలన్నీ ఎప్పుడు వీడతాయో ఏమో?
please share it..
Nijaniki naakemanipistundante bhoomi meeda manishi unnanta varaku aayugapurushuniki maranam ledu undadu.
ReplyDeleteNijaniki naakemanipistundante bhoomi meeda manishi unnanta varaku aayugapurushuniki maranam ledu undadu.
ReplyDelete