మీడియా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే దాని ప్రధాన లక్ష్యం. కానీ కొన్ని చానెళ్లు పనికట్టుకుని కొన్ని సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నాయి.. వాళ్లకి ప్రకటనలు ఇస్తే ఒకలా.. ఇవ్వకపోతే మరోలా ప్రచారం చేస్తూ సినిమా
నిర్మాతలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.. ఈ వారం విడుదలైన సినిమాల్లో “నేను శైలజ” చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే “నేను శైలజ” హిట్టా సూపర్ హిట్టా అనేదానిపైన చర్చ జరుగుతోంది కానీ హిట్టా ఫ్లాపా అనే ప్రశ్నే లేదు. ఈ వారం విడుదలైన సినిమాలపై ఒక ప్రముఖ ఛానెల్‌లో ఒక కార్యక్రమం వచ్చింది. అందులో వాళ్లు చెప్పిన దాని ప్రకారం “నేను శైలజ” సినిమా ఫ్లాప్ అట. హీరో “రామ్” ని వరుస ఫ్లాప్స్ నుంచి శైలజ కూడా కాపాడలేకపోయిందట.
“నేను శైలజ” సినిమా ఫ్లాప్ కావడంతో వేరే సినిమాలకు థియేటర్స్ పెరుగుతున్నాయన్నది దాని సారాంశం. సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది మొదటి షో నుంచే తెలిసిపోతున్న రోజులివి. కానీ సినిమా విడుదలై ఒక రోజు అయిపోయిన తర్వాత.. అది కూడా పాజిటివ్ టాక్‌తో వెళుతున్న సినిమాను.. ఇలా ప్లాప్ లిస్ట్‌లో చేయడం వెనుక వారి ఉద్దేశమేమిటో మరి! మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.35 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. అన్ని ఛానల్స్, అన్ని వెబ్ సైట్స్ ఏకగ్రీవంగా 2016 లో మొదటి హిట్ సినిమాగా డిక్లేర్ చేసిన సినిమాని ఫ్లాప్ అంటున్నారు? ఇలా ఎందుకంటే.. కొందరు నిర్మాతలు ఒక యూనిట్ గా ఏర్పడి, కొన్ని ఛానల్స్ కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలనే రూల్ తెచ్చాక టి.వి.ఛానల్స్ లో ఇటువంటివన్నీ ఎక్కువైపోయాయని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్ళకు యాడ్స్ బాగా ఇస్తే ఒక రకంగా, యాడ్స్ ఇవ్వకపోతే ఇంకో రకంగా న్యూస్ ప్రసారం చేస్తూ, చెత్తంతా ప్రచారం చేస్తున్నారట. అయితే బాగున్న సినిమాకు ఎన్నిరకాలుగా నెగెటివ్ ప్రచారం చేసినా.. అది వాళ్ల క్రెడిబిలిటీని దెబ్బతీసేదే అవుతుంది తప్ప.. సినిమాకి నష్టం కలిగించడం మాత్రం వారి వల్ల కాదనే విషయాన్ని ఛానెళ్లు తెలుసుకుంటే బెటర్.
కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక, ఛానెల్‌కు చిత్ర పరిశ్రమ నుంచి యాడ్స్ రాకపోవడంతో వాళ్లు టాలీవుడ్‌ను ఏకేస్తూ వరుస కథనాలు ప్రసారం చేశారు. చివరకు ఆ మీడియా సంస్థకు యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక…నెగిటివ్ సమీక్షలు..టాలీవుడ్‌పై నెగిటివ్ కథనాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఇదే కోవలో నేను…శైలజ సినిమా యాడ్స్ సదరు టాప్ ఛానెల్‌కు ఇవ్వకపోవడంతో వాళ్లు ఆ సినిమాను ప్లాప్ చేశారు.
please share it..
No comments:
Post a Comment