Sunday, 31 January 2016

తుని ఘటనపై పవన్ కల్యాణ్ ఆందోళన: కేరళ నుంచి హైదరాబాద్‌కు, ప్రెస్ మీట్

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన శాంతిభద్రతల సమస్యగా మారడంపై జనసేన చీఫ్, తెలుగు సినీ హీరో పవన్ కల్యాణ్ చలించిపోయినట్లున్నారు. ఆయన కేరళ నుంచి హైదరాబాదుకు పయనమయ్యారు. కేరళలో జరుగుతున్న సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రేపు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతారు. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

Pawan Kalyan

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. బిజెపి, టిడిపి కూటమికి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిందనే అభిప్రాయం బలంగా ఉంది. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఏర్పాటైన కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆదివారం సాయంత్రం తునిలో పెద్ద యెత్తను హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు తగులబెట్టారు. తునిలోని రెండు పోలీసు స్టేషన్లపై కూడా దాడి చేసిన నిప్పుపెట్టారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై, రైలు పట్టాలపై బైఠాయించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

No comments:

Post a Comment