“పిల్లా నువ్వులేని జీవితం”తో ఎంట్రీ ఇచ్చిన “మెగా అల్లుడు” సాయిధరమ్‌కు ఇప్పుడొక కొత్త కష్టం వచ్చిపడింది.అతడి సెక్యూర్టీ గార్డ్ దుబాసి నాగేందర్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.పదిరోజుల కిందటే సాయిధరమ్ తేజ్ సెక్యూర్టీ గార్డ్ గా జాయిన్ అయిన 23 యేళ్ల నాగేందర్ ఇటీవల మూడో తరగతి చదువుతున్న అమ్మాయిని రేప్ చేశాడన్నది పోలీసుల కథనం.బంజరాహిల్స్ సమీపాన ఉన్న ఇందిరానగర్ చోటుచేసుకు న్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయ్. తన ఇంటి ముందు కొంతమంది పిల్లలతో కలిసి ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఇచ్చి, మాయ చేసి ఆ .. బుజ్జాయిని తన ఇంటి లోపలికి తీసుకెళ్లి రేప్ చేసాడట!పాప ఇంట్లోంచి బయటికి ఏడుస్తూ రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాగేందర్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.వాస్తవానికి నాగేందర్ ని సాయి ధరమ్ నేరుగా.. అపాయింట్ చేసుకోలేదు.ఓ సెక్యూర్టీ ఏజెన్సీ ద్వారా.. అతడికి తేజూ దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది.దీంతో సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పోలీసులు విచారించారు.నిందితుడు నాగేందర్‌ది మెదక్ జిల్లా అని, అతని నేపథ్యం..కుటుంబ వివరాలు గురించి తెలుసుకున్న తర్వాతే కొలువులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం నిందితుడ్ని అరెస్ట్ చేసి కటకటలా వెనక్కు పంపారు ఖాకీలు.
please share it..
No comments:
Post a Comment