Sunday, 3 January 2016

పెద్ద మిస్టేక్: శ్రీనువైట్ల పై భార్య గృహహింస కేసు

srini

గుట్టు చప్పుడు కాకుండా జరిగిన విషయం, ఇప్పడు ఫిల్మ్ నగర్ లో ఓపెన్ టాక్ గా నిలిచింది. గత కొంత కాలంగా బ్యాడ్ నడుస్తున్న శ్రీనువైట్లకి, తాజాగా ఇంటి సమస్య కూడ నెత్తినకూర్చుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీనువైట్ల కి కోపం చాలా ఎక్కవ అని అందరూ అంటుంటారు. అయితే ఎక్కడా శ్రీనువైట్ల ఆ విషయాన్ని బయటకు కనిపించకుండా మేనేజ్ చేశాడు. తన మూవీలలో హీరోలపై, కమెడియన్స్ పై సెటైర్స్ వేస్తూ ముందుకు వెళ్ళినా, ఆ మూవీ పరంగా వచ్చిన కామెంట్స్ పై తను క్లారిటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ బాద్ షా, ఆగడు మూవీ సమయంలో కోనవెంకట్, ప్రకాష్ రాజ్ లపై శ్రీనువైట్ల విపరీతమైన కోపంతో విరుచుకుపడ్డాడు. అప్పటి నుండి తను ఇంటిలోనూ సమస్యలు మొదలైనాయి. ఇక తాజాగా శ్రీను వైట్లపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో 498/A ప్రకారం గృహహింస కేసు నమోదైంది. గత కొద్ది నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ శ్రీను వైట్ల భార్య సంతోషి రూప ఇరవై రోజుల క్రితం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు శ్రీను వైట్ల వాంగ్మూలం నమోదు చేయాలని భావించగా ఇంతలో రూప వైట్ల తమ మధ్య సఖ్యత కుదిరిందంటూ కేసు వాపసు తీసుకోవాలని భావించింది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అప్పటికే ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావటంతో ఇప్పుడు కేసు మా పరిధిలో లేదని, కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని పోలీసులు సమాధానమిచ్చారట. రూపవైట్లతో శ్రీనువైట్ల మొదట్లోనే రాజీపడితే విషయం ఇక్కడ వరకూ ఇచ్చేది కాదని చాలా మంది అంటున్నారు.
please share it..

No comments:

Post a Comment