Monday, 11 January 2016

జూనియర్ కి డైలాగ్స్ తో బాలయ్య వార్నింగ్

450452010

2016వ సంవత్సరం సంక్రాంతి పండుగ కి ప్రత్యేక సంతరించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో నందమూరి హీరోల సినిమాలు పోటీకి నిలబడటం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక ఎవరికి వారే, వారి మూవీలను ప్రమోట్ చేసుకుంటూ వెళుతున్నారు. అయితే బాలకృష్ణ మూవీ కంటే ఎన్టీఆర్ మూవీ సక్సెస్ సాధిస్తుందని అందరూ అంటున్నారు. దీంతో అందరూ బాలకృష్ణ పై నందమూరి ఎన్టీఆర్ పోటీగా మారాడు అని అంటున్నారు. దీంతో జూనియర్ పై బాలయ్య తన దైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. బాలకృష్ణ 99 వ సినిమా ‘డిక్టేటర్’ పై అసలైన నందమూరి అభిమానులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే డిక్టేటర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లోని బాలకృష్ణ చెప్పిన డైలాగులు జూనియర్ ని ఉధ్ధేశించని అంటున్నారు. శనివారం జరిగిన ‘ప్లాటినం డిస్క్ ఫంక్షన్’ ఇందుకు వేధికగా నిలిచింది. ఓ డైలాగ్ కి సంబంధించి విలన్ నుండి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. “ఈ టైంలో ఆ డిక్టేటర్ కి ఎదురెళ్ళడం మంచిది కాదు” అనే డైలాగ్ … జూనియర్ ని ఉద్ధేశించి అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే గతంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కథా పరంగా ఉన్నప్పటికీ..అవి ఇండస్ట్రీలోని ప్రముఖలను టార్గెట్ చేసుకొని చెప్పిన డైలాగ్స్ అని అందరూ భావించారు. ఇది కూడ జూనియర్ ని ఉద్ధేశించి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అని అంటున్నారు.

No comments:

Post a Comment