యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – ఇంటెలిజెంట్ అండ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ కేరీర్‌లోనే 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో ఇక 13న రిలీజ్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. పొంగల్ ఫైట్ మరింత టఫ్ అయినట్లే. అయితే.. ఈ మూవీ పూర్తి స్థాయి సెంటిమెంట్ అని ఇప్పటికే చెప్పేశారు. ఫుల్ లెంగ్త్ గా ఎమోషన్స్ ను కేరీ చేస్తున్నట్లు ప్రోమోలు – టీజర్లు – ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది. మరి నాన్నకు ప్రేమతో లాంటి చిత్రానికి యూ/ఏ ఎందుకు వచ్చిందా అనే ఆలోచనలు మొదలయ్యాయి.
అలాగే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లతో పాటు క్లైమాక్స్, హీరో-విలన్ మధ్య జరిగే పోటా పోటీ సన్నివేశాలను ఓ మైండ్‌గేమ్‌లా డిజైన్ చేయడం బాగుందని సెన్సార్ టీం సినిమా యూనిట్‌కు కితాబునిచ్చిందట. సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికేట్ రావడానికి యాక్షన్ సన్నివేశాలా? లేక ఎమోషనల్ డైలాగులా? అనేది తెలియట్లేదు. మరోవైపు.. నాన్నకు ప్రేమతో నిడివి చాలా ఎక్కువగా ఉందని ఈ లోగా మరికొన్ని సీన్లు ఎడిట్ చేస్తారని కూడా టాక్ వస్తోంది.
ఓవరాల్‌గా రన్ టైం కాస్త ఎక్కువగానే ఉన్నా సినిమా మాత్రం ఎన్టీఆర్, జగపతిబాబు ఎత్తు, పై ఎత్తులతో పాటు ఎమోషనల్ సీన్లతో ఇంట్రస్టిగ్‌గా..చాలా రిచ్, స్టైలీష్‌గా ఉన్నట్టు సెన్సార్ టాక్ ద్వారా తెలుస్తోంది. సెన్సార్ కూడా పూర్తవడంతో సినిమా పక్కాగా జనవరి 13న రిలీజ్ అవుతోందన్న విషయాన్ని చిత్ర యూనిట్ మరోసారి అధికారికంగా ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమా చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన నాన్నకు ప్రేమతో 13న ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
please share it..
No comments:
Post a Comment