Sunday, 3 January 2016

మ‌హేశ్ అదే ప‌ని.. మ‌ళ్లీ..మ‌ళ్లీ..

0232s32d3s20

పెద‌వి ముద్దు అందుకోవాలి.ఫ్రెంచ్ కిస్ ఇచ్చుకోవాలి.అధ‌రామృతం జుర్రుకోవాలి.ఒక‌రి ప్రేమను మ‌రొక‌రు ముద్దుల‌తోనే పంచుకోవాలి. మ‌హేశ్ కూడా ఇప్పుడిదే చేస్తున్నాడు.క‌లిసొచ్చిన క‌థానాయిక‌ను ముద్దుల‌తో ముంచెత్తుతున్నాడు. ఎలా అంటే..? గ‌త కొద్ది కాలంగా టాలీవుడ్ స్క్రీన్‌కు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ తెలుగింట సంద‌డి చేయ‌బోతోంది. మహేశ్ బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో టీటౌన్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది.అంతేకాదు ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ను సైతం పండించ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకోనుంది. అందుకే.. ఈ సినిమాలో రాజ‌కుమారుడితో లిప్‌లాక్స్‌కు సై అంది.గతంలో బిజినెస్‌మాన్ మూవీలో మ‌హేశ్ కు త‌న అధ‌రామృతం అందించింది. అటుపై మ‌హేశ్ పెద్ద‌గా హీరోయిన్ల‌తో రొమాన్స్ పండించ‌లేదు. సినిమాకు హైప్ తీసుకువ‌చ్చేందుకు డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల కొన్ని క్లోజ్ రొమాంటిక్ సీన్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేశాడట!ఇందులో భాగంగానే ఓ రొమాంటిక్ లిప్‌లాక్ సీన్ కూడా ఉందని ఫిల్మ్ నగర్ ఖ‌బ‌ర్‌.ఇందుకు హీరో గారు అభ్యంతరం చెప్పినా, దీని ప్రాముఖ్యాన్నివివ‌రించి, మ‌హేశ్‌ను ఒప్పించాడ‌ట శ్రీకాంత్ అడ్డాల. ఇటు కాజల్ కూడా సరే అందని, త్వ‌ర‌లోనే వీరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అభిమానుల ముందుకు వ‌చ్చి, అల‌రించ‌నుంద‌ని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
please share it..

No comments:

Post a Comment