ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడో..లేదో..అప్పడు భారీగా ఇన్వెస్ట్ మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడు. తన మొదటి మూవీ శ్రీమంతడుతో నిర్మాతగా మహేష్ కి ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో ప్రస్తుతం తను చేస్తున్న బ్రహ్మోత్సవం మూవీకి సైతం మహేష్ కి టేబుల్ ప్రాఫిట్స్ వచ్ఛే ఛాన్స్ ఉంది. మహేష్ మూవీలకి 60 కోట్ల రూపాయల బిజినెస్ అనేది కంపల్సరీగా అవుతుందనేది కాన్ఫిడెంట్ మార్కెట్ వర్గాల్లో ఉంది. ఇక మూవీ ఏ మాత్రం గుడ్ టాక్ ని సంపాదించుకున్నా… అవలీలగా వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేయటం చాలా సింపుల్ విషయం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు, తను స్థాపించిన బ్యానర్ నుండి దాదాపు 70 కోట్ల రూపాయలను తన మూవీలపై ఇన్వెస్ట్ చేశాడంట. ఈ 70 కోట్ల రూపాయలలో 25 కోట్ల రూపాయలు బ్రహ్మోత్సవం మూవీపై పెట్టుబడి పెట్టగా, మిగిలిన మొత్తాన్ని మురుగదాస్ మూవీపై పెట్టుబడికి రెడీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించే చిత్రంలో మహేశ్ డ్యూయల్ చేయనున్నాడే విషయం తెలియటంతో ఈ మూవీపై ఇంకా అంచనాలు పెరగిపోయాయి. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలసి సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో మహేష్ సైతం భారీ పెట్టుబడులని పెట్టడం విశేషంగా మారింది. ప్రస్తుత సమాచారం ప్రకారం మురుగదాస్, మహేష్ కాంబినేషన్ మూవీ దాదాపు 80 కోట్ల రూపాయలతో తెరకెక్కనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలపై త్వరలోనే క్లారిటి రానుంది.
please share it..
No comments:
Post a Comment