Thursday, 7 January 2016

రామ్ ని చూసి భయపడ్డ జూనియర్

584050120

జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిచింన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఎన్.టి.ఆర్ కి ఇది 25వ సినిమా కావటంతో ఈ మూవీపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా జరుపుకుంటుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ సెన్సార్ కి కూడా వెళ్లనుంది. ఇదిలా ఉంటే హీరో రామ్ ని చూసి జూనియర్ భయపడుతున్నాడంట. రామ్ నటించిన నేను శైలజా మూవీ అన్నీ ఛానల్స్ కి యాడ్స్ ఇవ్వకుండా కొన్ని ఛానల్స్ కి ఇవ్వటంతో మిగతా ఛానల్స్ ఈ మూవీపై నెగిటివ్ స్టోరీలను ప్లే చేశాయి. ఇక జూనియర్ మూవీ నాన్నకు ప్రేమతో సైతం, అన్ని ఛానల్స్ కి ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దీంతో ఇప్పటికే నాన్నకు ప్రేమతో మూవీని ఏ విధంగా టార్గెట్ చేయాలి? అనే కోణంలో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ప్లానింగ్ ని వేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ భయడుతున్నాడంట. ఇప్పటికే నిర్మాతతో మాట్లాడి అన్ని ఛానల్స్ కి ఎంతో కొంత మనీను యాడ్స్ రూపంలో ఇవ్వాల్సిందిగా జూనియర్ కోరాడంట. ఇక డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నాడు. జనవరి 7వ తేదీ నుండి ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ టీవీఛానల్స్, పేపర్ ఇతర మాధ్యమాల్లో కనిపించనున్నాయి.
please share it..

No comments:

Post a Comment