యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా రోజుల తర్వాత నేను…శైలజ సినిమాకు హిట్ టాక్ రావడంతో
కాస్త జోష్‌లో ఉన్నాడు. నేను..శైలజ ఓకే అనిపించుకోవడంతో మనోడు ఎక్కడికక్కడ ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్లు రావడంతో తనవంతుగా హెల్ఫ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు చాలా మీడియా ఛానెళ్లు, సంస్థలతో పాటు చాలా వెబ్‌సైట్లలో పాజిటివ్ రివ్యూలు రాగా టీవీ-5 ఛానెల్ మాత్రం సినిమా పెద్ద డిజాస్టర్ అని ఏకిపాడేసింది. దీంతో రామ్ టీవీ-5 రివ్యూపై స్పందిస్తూ ‘ఆ ఒక్క ఛానెల్లో తప్ప వరల్డ్ వైడ్ నా సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషం’’ అంటూ మొన్న రామ్ పెట్టిన ట్వీట్ ఆసక్తికర చర్చకే దారి తీసింది. ఆ న్యూస్ ఛానెల్ తన సినిమా ‘నేను శైలజ’కు వ్యతిరేకంగా రివ్యూ ఇవ్వడంపై రామ్ ఆవేదన వ్యక్తం చేయడం.. ఆ ఛానెల్ ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేయడం తెలిసిన సంగతే.
అయితే మరోసారి ఆ ఛానెల్ రామ్‌ను టార్గెట్‌గా చేసుకుని మరో కథనం ప్రచురించింది. అయితే ఈ వివాదం కాస్త నిన్న రాత్రం కొత్త టర్న్ తీసుకుంది. టీవీ -5 ఛానెల్లో పని చేస్తున్న నవీన్ అనే ఉద్యోగి నేను…శైలజ సినిమా బాగుందని…ఆ సినిమాపై టీవీ-5 ఇచ్చిన రివ్యూను వ్యతిరేకిస్తూ మాట్లాడినందుకు అతడిని ఉద్యోగంలోనుంచి యాజమాన్యం తీసివేసిందట. ఈ మాట ఆ నోటా ..ఈ నోటా బయటకు రావడంతో అది రామ్ చెవిన పడింది. వెంటనే రామ్ ఆవేశంగా రెస్పాండ్ అయ్యారు. నవీన్ తన అభిమాని అని తెలుసుకుని అతడికి సారీ చెప్పాడు. అంతే కాదు.. నవీన్ కు ఉద్యోగం వచ్చే వరకు అతడి జీతం తాను ఇస్తానని కూడా ప్రకటించి సంచలనం సృష్టించాడు.
ఇంకా రామ్ ఈ ఘటనపై స్పందిస్తూ ‘‘ఈ సొసైటీ ఎటు పోతోందో నాకర్థం కావడం లేదు. నేను శైలజ రివ్యూ మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ ఛానెల్ నవీన్ అనే ఉద్యోగిని తప్పించిందట. అతను నా ఫ్యాన్ అని కూడా తెలిసింది. ఆ ఛానెల్ నిర్ణయాన్ని గౌరవిస్తా. అందులో లాజిక్ ఉంది. కానీ ఫ్యాన్స్ విషయానికి వస్తే లాజిక్కుల గురించి ఆలోచించను. నవీన్ కు నా సారీ. అతను మరో జాబ్ లో చేరే వరకు నా ఆఫీస్ కు వచ్చి ప్రతి నెలా జీతం తీసుకోవచ్చు’’ అని ప్రకటించాడు రామ్. రామ్ రీ కౌంటర్‌పై టీవీ-5 ఛానెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా రామ్ వర్సెస్ టీవీ-5 వార్ ఇప్పుడు టాలీవుడ్ & మీడియా సర్కిల్స్‌లో పెద్ద ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది.
please share it..
No comments:
Post a Comment