అతడు దృశ్యం సినిమా బాగా అర్థం చేసుకున్నాడు.బుర్రకు
ఎక్కించుకున్నాడు. ఆ.. సినిమా హీరో పాత్రను రియల్ లైఫ్‌లోనూ ఫాలో అయ్యాడు. కాకపోతే సినిమాలో హీరో ఫ్యామిలీ మీద ప్రేమతో చేస్తే ఈయన గారు మాత్రం ఆలిని వదిలించుకునేందుకు పన్నాగం పన్నాడు. అతి తెలివికి పోయాడు.సినిమా స్క్రీన్‌ప్లేను ఎప్లై చేశాడు. అన్నట్లు గురుడు ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. పేరు రామకృష్ణ. ఊరు నిజామాబాద్.నారాయణగూడ పీఎస్‌లో కొలువు.పోలీస్‌గా ట్రాక్ రికార్డ్ బాగుడండం, మంచి కుటుంబం కావడంతో గత ఏడాది ఆగస్టు 20న మనోడిని సుప్రియకు ఇచ్చి
అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు పెద్దలు.తరువాత హిమాయత్ నగర్‌లో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల తరువాత తన భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. క్రమంగా అది ముదిరిపాకాన పడడంతో ఈ ఏడాది ఆగస్టు ఆరున ఒంటరిగా ఉన్న సుప్రియను టవల్ తో ఉరేసి చంపేశాడు. స్నేహితుడు ప్రదీప్ సాయంతో మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, వికారాబాద్ అడవులకు తరలించి, అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత తన భార్య కనిపించడం లేదని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసి, నయా నాటకానికి తెరలేపాడు.తనతో పాటూ ఉంటున్న బావమరిదిని కూడా నమ్మబలికాడు.సుప్రియ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో నిజం చెప్పాడు. పోలీసులు కూడా రామకృష్ణపై అనుమానంతో ఓ కన్నేసి, దర్యాప్తు సాగించారు.ఆఖరికి విచారణలో నిందితుడు చెప్పిన నిజాలకు, దర్యాప్తులో భాగంగా ఆధారాలకు సరిపోలడంతో విస్తుబోవడం తోటి పోలీసుల వంతైంది.

please share it..
No comments:
Post a Comment