టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు స్టార్ హీరోయిన్ అయిపోయిన బక్కపల్చని
భామ రెజీనా గురించి ఇప్పుడు ఓ హాట్ న్యూస్ టీ టౌన్ సర్కిల్స్‌లో జోరుగా హల్‌చల్ చేస్తోంది. ఆమె మెగా ఫ్యామిలీకి చెందిన ఓ కుర్ర హీరోతో లవ్‌లో ఉందని…త్వరలోనే వాళ్లిద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ పుకార్లు..షికార్లు చేస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్-రెజీనా కలిసి తొలిసారిగా గతేడాది వచ్చిన పిల్లా నువ్వులేని జీవితం సినిమాలో జోడీ కట్టారు.
తర్వాత ఈ ఏడాది వచ్చిన సుబ్రహ్మణ్యం పర్ సేల్ సినిమాలో కూడా మరోసారి ఆన్‌స్ర్కీన్ రొమాన్స్ చేసి మెప్పించారు. ఈ రెండు సినిమాల్లో ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగుందన్న టాక్ ఫిల్మ్‌నగర్లో జోరుగా వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరు నిజ జీవితంలో కూడా ప్రేమికులుగా మారారట. సాయి ప్రస్తుతం చేస్తున్న తిక్క సినిమా షూటింగ్ సెట్‌లో రెజీనా ఎక్కువగా కనిపిస్తోందట. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాకపోయినా తరచూ వచ్చి షూటింగ్ గ్యాప్‌లో సాయితో కబుర్లు చెపుతోందట.
సాయి-రెజీనా పదే పదే షూటింగ్ స్పాట్‌లోనే మీటింగ్ పెట్టేయడంతో వీరిద్దరి ఆఫ్ స్ర్కీన్ రొమాన్స్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ వార్తలపై రెజీనా స్పందించింది. సాయిధరమ్ కీ తనకు లింక్ పెట్టి వార్త రాగానే చాలా హ్యాపీగా ఫీలయ్యానని అంటోంది. తామిద్దరం రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన తమ మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారని..అవన్నీ కేవలం గాలి వార్తలేనని ఆమె కొట్టి పాడేసింది. తనకు ఇండస్ర్టీలో సాయిధరమ్‌తో పాటు సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది రెజీనా.
please share it..
No comments:
Post a Comment