టెర్రరిస్ట్‌గా మారిన టీచరమ్మ
సాధారణంగా చదువుకునే రోజుల్లో డాక్టర్, యాక్టర్, పోలీస్, కలెక్టర్ అవ్వాలని
అనుకోవడం సహజమే.. అటువంటి గోల్ ఉండడం కూడా శుభపరిణామమే. అటువంటి లక్ష్యం ఉన్నప్పుడే.. ఉన్నత ఉద్యోగాలకు, ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతాము. అయితే ఓ మహిళ టీచర్ అవుదామనుకుని టెర్రరిస్టు అయిందంట. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా.. నిజమే మరి.. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ గ్రీన్‌విచ్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకుంది. టీచర్‌గా సెటిలవుదామనుకుంది. కానీ చివరకు జిహాదీగా మారిపోయింది. ఉగ్రవాదుల సిద్ధాంతాన్ని వంటపట్టించుకుని టెర్రరిస్టుగా మారిపోయింది. ఈ టీచరమ్మ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆమెపేరు సనా అహ్మద్ ఖాన్. గ్రీన్ విచ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పుచ్చుకున్న ఆమె టెర్రరిస్టుగా మారి లండన్ లోని వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ను పేల్చివేయడానికి ప్లాన్ వేసింది. ఇందుకు ఆమె భర్త రెహ్మాన్ కూడా సహకరిస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి పెద్ద ప్లాన్ వేసుకున్నారు. అయితే, ఆమె భర్త ఓ ట్విట్టర్ లో చేసిన తప్పుడు ట్వీట్ తో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. రెహ్మాన్ ఇంటిపై పోలీసులు జరిపిన దాడుల్లో రెండు కార్లను, ఆయుధాలను ఇంతర సామాన్లను స్వాదీనం చేసుకున్నారు. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల తరువాత యూరప్ దేశాలు అన్ని కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇక, లండన్ లో పట్టుబడ్డ ఈ భార్యభర్తలకు కోర్ట్ 52 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఇలాంటి వారే ఇంకా అనేకమంది లండన్ లో ఉండి ఉంటారని భావించిన పోలీసులు నిఘాను పెంచారు.
please share it..
No comments:
Post a Comment