Monday, 4 January 2016

“డాన్”వారసుడు ఎవరు ?

9059046

పాకిస్థాన్ లో ఉంటూ భారత్ లోని చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం… రిటైర్మెంట్ తీసుకోవాలని డిసైడయ్యాడట. డిసెంబర్ 26న తన 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్న దావూద్ ఇబ్రహీం… ఇదే రోజు తన వారసుడు ఎవరనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని భారత్ నిఘా వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దావూద్… ఎప్పటి నుంచో డాన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడని తెలుస్తోంది. తన 60వ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా జరిపి… అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించేందుకు దావూద్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక దావూద్ స్థానంలో కొత్తగా మాఫియా డాన్ బాధ్యతలు చేపట్టడానికి దావూద్ సోదరుడు అనీస్ అహ్మద్ తో పాటు ఆయన ముఖ్య అనుచరుడు చోటా షకీల్ రేసులో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అయితే…ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు దావూద్ తో సన్నిహితంగా ఉండే కొందరు చోటా గ్యాంగ్ స్టర్స్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. మరోవైపు దావూద్ 60వ పుట్టినరోజు వేడుకలు పాకిస్థాన్ లోని కరాచీ లేదా దుబాయ్ లో జరిగే అవకాశం ఉందని తెలుసుకున్న నిఘా వర్గాలు… దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా… మన ప్రభుత్వాలు దావూద్ ను పట్టుకునే లోపు అతడు రిటైర్మెంట్ కు కూడా రెడీ అవుతున్నట్టు ఈజీగా అర్థమవుతోంది.
please share it..

No comments:

Post a Comment