`సుబ్బరావు ప్రైవేటు ఉద్యోగి. సరదాగా ఫ్రెండ్స్ అందరికీ మందు పార్టీ ఇచ్చాడు. తను
కూడా ఓ రెండు పెగ్గులు ఎక్కువే తాగాడు. పార్టీ అయిపోయింది.. ఇంటికి బయల్దేరాడు.. మత్తుగా ఉండటం వల్ల ఎదుట ఉన్న వాహనాలను గుర్తించలేకపోతున్నాడు. ఆ మత్తులో కారును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు.. కారు బోల్తా పడింది.. అయితే తీవ్రగాయాలతో బయటపడ్డాడు.` ఇది కల్పితమే అయినా చాలా వరకూ రోడ్డు ప్రమాదాలు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరుగుతున్నవే. తాగడం వల్ల కొంతమంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. లేక ఆ మత్తులో ప్రాణాలు బలిగొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం సరికొత్త నిబంధన ప్రవేశపెట్టబోతోంది.
తమ బార్లకు వచ్చే మందు బాబులకు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పించే ప్లాన్ లో ఉన్నాయట ఆ బార్ అండ్ రెస్టారెంట్ మేనేజ్ మెంట్లు. ఎందుకంటే.. బార్ అండ్ రెస్టారెంట్లలో తాగి బళ్లు నడపడం వల్ల జరిగే యాక్సిడెంట్లు నివారించాలంటే ఆ బార్లు వారిని ఇంటికి చేర్చేలా కొత్త రూల్ తెచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఈ రూల్ నుంచి బార్లు, రెస్టారెంట్లు తప్పించుకునే వీల్లేకుండా లిక్కర్ లైసెన్స్‌కు ఈ రూల్ ను లింక్ చేస్తారట. ఒకవేళ కాదూ, కూడదంటే ఆ బార్ల, హోటళ్ల లైసెన్సులు కేన్సిల్ చేయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం.
ప్రతిపాదన దశలో ఉన్న ఈ రూల్ అమల్లోకి వస్తే ఆ యా బార్ అండ్ రెస్టారెంట్లు తప్పని సరిగా మందుబాబులను ఇళ్లదగ్గర దింపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. లేదా ఆ మందుబాబులకు డ్రైవర్లను అయినా ఎరేంజ్ చేయాలనే నిబంధన తప్పని సరి చేయాలన్నఆలోచన కూడా ఉందనీ తెలంగాణా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెబుతున్నారు. ఒక్కో మందుబాబుకు ఎన్ని పెగ్గులదాకా సర్వ్ చేయాలో కౌంటర్లో ఓ లెక్క ఇస్తారట. ఒక వేళ మోతాదుకు మించి అమ్మినా ఆ బార్ల మీద యాక్షన్ తీసుకుంటారట. ప్రతిపాదన బాగానేఉన్న ఎంత వరకూ ఆచరణలో పెడతారో మరి.
please share it..
No comments:
Post a Comment