ఆ.. బాలిక వయస్సు 13 ఏళ్లు. తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ స్కూల్‌కు క్రమం తప్పక వెళ్తోంది. అయినా ఎవరూ గమనించలేదు. ఆ అమ్మాయికి 9 నెలలు నిండాయి. అయినా క్లాసు టీచర్ యథావిధిగా పాఠాలు చెబుతూ పోతోంది. ఇంతలో టాయిలెట్‌కు అని చెప్పి వెళ్లిందా బాలిక. అయితే అట్నుంచి పండంటి ఆడబిడ్డను మోసుకువచ్చింది. ఇది చూసి టీచర్లంతా ఆశ్చర్యపోయారు. బాలిక తల్లిదండ్రులను పిలిచి.. ఆమెను అక్కడి నుంచి ఆస్ప్రతికి తరలించారు.
హైద్రాబాద్, మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఒక బాలిక తొమ్మిది నెలల గర్భంతో ఉంటే..ఇంట్లో తల్లిదండ్రులకూ తెలిసీ పట్టించుకోలేదు. 20 మందికి పైగా ఉపాధ్యాయులున్న స్కూల్‌లో ఏ ఒక్కరూ గమనించలేదు. అందులోనా ఈ స్కూల్ హెడ్మాస్టర్ ఎంఈవో కూడాను. ఓ బాలికను బాలింతను చేసిన పాపం ఎవరిది? స‌్కూల్ టీచర్లు చెబుతున్నట్టు .. తల్లిదండ్రులకు తెలిసిన వ్యవహారమా.? లేదంటే ఎవరైనా బాలికను మాయమాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారా? అన్నది తేలాల్సి ఉంది.
please share it..
No comments:
Post a Comment