కాల్ మనీ… కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టించిన కేసు ఇది. డబ్బు అవసరం ఉన్నవారికి రుణం ఇచ్చి అధిక వడ్డీ ఇవ్వడంతో పాటు ఆడవాళ్లతో వ్యభిచారం చేయించడం వంటి నీచమైన పనులకు పాల్పడిన కొందరు దుర్మార్గులు… కాల్ మనీ కారణంగా మొత్తం ధర్మవడ్డీకి రుణం ఇచ్చేవారికి కూడా ఇబ్బందులకు గురి చేశారు. కాల్ మనీ కారణంగా ఊళ్లల్లో ధర్మవడ్డీకి రుణం ఇచ్చే రుణదాతలు కూడా తెగ ఇబ్బంది పడ్డారు. ఇదే అదనుగా ఇలాంటి వారికి కూడా రుణం ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన కొందరు రుణగ్రస్తులు… అలాంటి వారు కూడా అధిక వడ్డీలు వసూలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… ఇప్పట్లో మళ్లీ ఎవరికీ వడ్డీకి అప్పు ఇవ్వకూడదని చాలామంది నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలోని చాలామందికి రుణం దొరకడమే గగనమైపోయిందని తెలుస్తోంది. డబ్బు తీసుకుని రెగ్యూలర్ గా తిరిగి చెల్లించే వారికి సైతం రుణాలు ఇవ్వడానికి చాలామంది వెనకాడుతుండటంతో… చాలామంది పేదలకు అప్పు దొరకడమే కష్టమైపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి వరకు వెళ్లడంతో… కాల్ మనీ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చిన వెంటనే రుణదాతలపై కఠినంగా వ్యవహరించకుండా ముందు విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే… అప్పులు ఇచ్చి మరీ కష్టాలు తెచ్చుకోవడం ఎందుకుని భావిస్తున్న చాలామంది… కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారానికి దూరంగా ఉండటమే బెటరని భావించడంతో… ఏపీలో చాలామంది అప్పుపుట్టడం కష్టంగా మారింది తెలుస్తోంది.
please share it..
No comments:
Post a Comment