Thursday, 7 January 2016

లీటరు పెట్రోలుతో.. 410 కి.మీ.

0450250120

ఓ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ విద్యార్థి త‌న మేథాసంప‌త్తితో త‌యారు చేసిన మోటారు సైకిల్ భ‌విష్య‌త్తు ఇంధ‌న కొర‌త‌కు ప్రత్యామ్నాయంగా క‌న‌ప‌డుతోంది. ఈ మోటార్ సైకిల్‌తో లీట‌రు పెట్రోల్ పోసి 410 కి.మీ. ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని ఆ విద్యార్థి నిరూపించాడు. సాధార‌ణంగా మోటారు బైక్‌లు లీట‌రుకు 60-70 కి.మీ. మైలేజీ రావ‌డం గొప్ప‌గా ఉన్న ఈ రోజుల్లో ఈ విష‌యం అంద‌రికీ ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజ‌మే.. న‌మ్మి తీరాల్సిందే. కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌కు చెందిన ఉమేష్ అనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఈ మోటార్ బైక్ త‌యారు చేశాడు.
మెకట్రానిక్స్‌(వేర్వేరు ఇంజినీరింగ్‌ పద్ధతులను మిళితం చేసి డిజైన్లను రూపొందించే విధానం) అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐసీ, ఇంజిన్‌, రెండు బ్యాటరీలు, అల్ఫాసీట్‌, గేర్‌ బాక్స్‌, డీసీ మోటార్‌ సహాయంతో రూ. 40 వేల ఖర్చుతో ఈ బైకును రూపకల్పన చేశాడు. సాధారణ బైకులో లీటరు పెట్రోలుతో మహా అయితే 80 కిలోమీటర్లు వెళ్లవచ్చని, తాను రూపొందించిన బైకులో లీటరు పెట్రోలుతోనే 410 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. దీని వివరాలను ఇంటర్‌నెట్‌లో ఉంచగా దుబాయికి చెందిన ఓ కంపెనీ తనను సంప్రదించిందని, దేశంలో ఏదైనా కంపెనీ ముందుకొస్తే.. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసేందుకు సిద్ధమని ఆ యువ‌కుడు అంటున్నాడు. ఇండియాలో ఏదైనా కంపెనీ
ముందుకొస్తే ఈ బైక్‌తో దేశంలో భ‌విష్య‌త్తులో ఇంధ‌న కొర‌త‌ను చాలా వ‌ర‌కు నివారించ‌వ‌చ్చు.
please share it..

No comments:

Post a Comment