Thursday, 7 January 2016

మెగాస్టార్ 150వ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్




మెగాస్టార్ చిరంజీవి తాజాగా రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న 150వ  సినిమాను తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగు లో వి వి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనుష్క ను తిసుకోవాలని భావించిన చిత్ర బృందం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉండడంతో నయనతార ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ రెండు వారాల్లో  అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. జనవరి లాస్ట్ వీక్ లో సినిమాను లాంచ్ చేసి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, లైక ఎంటర్టైన్ మెంట్స్  వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. please share it..

No comments:

Post a Comment