హేమ, సురేఖ BMW కార్లు ఎలా కొన్నారబ్బా?
సినిమా ఇండస్ర్టీలో స్టార్ హీరోలకు
సంపాదన ఎక్కువే. వారు ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషకాలు తీసుకుంటారు. అలాగే ఇండస్ర్టీలో ఎప్పటి నుంచో తిష్టవేసిన కామెడీ ఆర్టిస్ట్ బ్రహ్మానందం లాంటి వాళ్లకు కూడా వాళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సిందే. ఇలాంటి వాళ్లు ఖరీదైన కార్లు, విల్లాలు కొనుక్కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్లు కూడా ఖరీదైన రేంజ్‌రోవర్లు, బీఎండబ్ల్యూ , లాండ్ కార్లు కొనారంటే షాకవ్వాల్సిందే.
సినిమాల్లో వదిన, అత్త క్యారెక్టర్లు వేసే సురేఖవాణి, హేమ కూడా ఇటీవలే బీఎండబ్ల్యూ కార్లు కొన్నారట. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్లిద్దరికి టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయట. హీరోయిన్లు సంవత్సరానికి మహా అయితే నాలుగైదు సినిమాలు చేస్తే గొప్ప. వీళ్లు మాత్రం ఏకంగా పదుల సంఖ్యలో సినిమాలు చేయడంతో వీళ్ల సంపాదన కూడా చాలా ఎక్కువగానే ఉంటోందట.అందువల్లే వీరిద్దరు బీఎండబ్ల్యూ కార్లు కొనడంలో ఆశ్చర్యం లేదని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
No comments:
Post a Comment