శింబు, అనిరుధ్ అరెస్టు..?
ప్రముఖ తమిళ హీరో శింబు, వై దిస్ కొలవెరి పాటకు సంగీతం
అందించిన అనిరుధ్ రవిచందర్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసభ్య పదజాలంతో అమ్మాయిలను అవహేళన చేస్తూ శింబు పాడిన పాటకు మహిళల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడు తమిళనాట ‘బీప్ సాంగ్స పెను వివాదం రేపుతోంది. దీనిని పాడింది శింబు కాగా, సంగీతం అందించింది అనిరుధ్ రవిచంద్రన్. ఈ పాట అసభ్య పదాలతో యువతులను అవమానించేలా ఉందని, పిల్లలు దాని అర్ధం తెలియకున్నా స్టేజీల మీద పాడుతున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
అఖిల భారత మహిళా ప్రజాస్వామ్య సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో అనిరుధ్, శింబును అరెస్టు చేయాలంటూ కోయంబత్తూర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రాధిక ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఈ ఫిర్యాదు చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరి అరెస్టుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాను సంగీతం అందించలేదని, నా ప్రతిష్టను దెబ్బతీసి అవౌరవ పరిచేందుకు ఎవరో కుట్ర పన్నారని సంగీత దర్శకుడు అనిరుధ్ అంటున్నాడు. శింబు ఈ పాట పాడి ఉండడని, ఆయన వాయిస్ టెస్ట్ చేసి నిజాలు వెలికి తీయాలని అభిమానులు కోరుతున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.
No comments:
Post a Comment