మగాళ్ల ప్రవర్తన పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ నుంచి
విడిపోయాక ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటున్న రేణు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన ట్విట్టర్ వేదికగా మగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మగాళ్ల చూపులన్నీ ఒకేలా ఉంటాయని…. మహిళలు ఏ డ్రస్ వేసుకున్నా వారి చూపులు మాత్రం వారి వైపే ఉంటాయని ఆమె పేర్కొంది.
రేణు తన పోస్ట్‌తో పాటు బురఖాలు ధరించిన ఇద్దరు అమ్మాయిలను బైక్‌పై కూర్చున్న ఇద్దరు యువకులు కన్నార్పకుండా చూస్తున్న ఓ దృశ్యాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.. మహిళల వస్త్రధారణకు మగవారి చూపులకు ఎటువంటి సంబంధం ఉండదని వ్యాఖ్యానించింది. స్లీవ్ లెస్, షార్ట్ లెంగ్త్, జీన్స్ ఇలా ఏ తరహా దుస్తులు వేసుకున్నా, నిండుగా వస్ర్తాలు కప్పుకున్నా సరే మగాళ్లు ఆడాళ్ల వైపు ఒకే రకంగా తేరిపార చూస్తారని రేణు పోస్ట్‌లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వెనుక ఎవరినో ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదన్నట్లు.. మగాళ్ల ప్రవర్తన గురించి మాత్రమే అని చెప్పుకోవచ్చు.
please share it..
meee father kuda alaganenaa.....
ReplyDelete