ప్రిన్స్ మహేష్‌బాబు వన్ – నేనొక్కడినే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ గుర్తుందా..ఆ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన కృతికి వరుసపెట్టి ఆఫర్లు వస్తాయనుకున్నారు. అయితే వన్ ప్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో పెద్దగా ఛాన్సులు రాలేదు. తర్వాత ఈ యేడాది వచ్చిన నాగచైతన్య దోచేయ్ సినిమాలో ఆమె నటించినా ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ ఆమెకు పెద్ద కలిసి రాలేదు. అయితే బీ టౌన్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన దిల్‌వాలే సినిమాలో ఆమె వరుణ్‌ధావన్ సరసన నటించింది.
అయితే కృతి ఇప్పుడు మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్‌తో ఆమె రొమాన్స్‌కు రెఢీ అంటోంది. సుశాంత్ అంటే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కాదండోయ్.. బాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్. ఈ హీరో ముందు టీవీ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యి బాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ధోని సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీదకు వెళ్లకుండానే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం బీటౌన్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇద్దరు డేటింగ్ లో ఉన్నారట. కెరీర్ ఎలాగు రయ్ రయ్ అంటూ మంచి స్పీడ్ మీదే ఉండడంతో డేటింగ్‌లో కూడా వీరు అదే జోరు చూపిస్తున్నారని సమాచారం. కృతి నిన్నటి వరకు జాకీష్రాప్ తనయుడు టైగర్‌ష్రాప్‌తో డేటింగ్ చేసినట్టు వార్తలు రాగా ఇప్పుడు కొత్త సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో కొత్త హీరోతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు బీ టౌన్‌లో జోరుగా వార్తలు పుకార్లు….షికార్లు చేస్తున్నాయి.
please share it..
No comments:
Post a Comment