ఆన్‌లైన్ షాపింగ్ లో మరో మోసం?
ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటున్నారా? ఆఫర్లు చూసి ఎట్రాక్ట్ అవుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాల్లో మరొకటి వచ్చిచేరింది. మొబైల్ కోసం ఆర్డరిచ్చిన ఓ కుర్రాడికి ఊహించని రీతిలో.. ఖంగుతినిపించే పరిణామామొకటి ఎదురైంది.
వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, గుత్తిలో జెండావీధికి చెందిన మహ్మద్ హుసేన్‌కు… ఈ నెల 23న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి ప్రథమ రత్న ఆస్ట్రలాజికల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామన్నారు. శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ మొబైల్‌కి భారీ ఆఫర్ ఉందన్నారు. మొబైల్ అసలు రేటు 8వేల నాలుగు వందలైతే… తాము ఆఫర్‌లో 3వేలకే ఇస్తామన్నారు. వస్తువును చూసిన తర్వాతే… డబ్బులు చెల్లించమన్నారు. నిజమేననుకున్న మహ్మద్… మొబైల్ ద్వారానే ఆర్డర్ ఇచ్చాడు. నాలుగు రోజుల తర్వాత పోస్టాఫీసు నుంచి కాల్ వచ్చింది. పార్శిల్ వచ్చింది తీసుకెళ్లమన్నారు. పార్శిల్‌ను తెరుద్దామనుకుంటే… పోస్టాఫీసు వాళ్లు ఒప్పుకోలేదు. నమ్మకంతో పార్శిల్ తీసుకొని 3వేల రూపాయలు చెల్లించాడు. ఇంటికొచ్చి పార్శిల్ తెరిస్తే… ఓ బాక్సు… అందులో ఐరన్ లాకెట్ కనిపించాయి. అవాక్కైన మహ్మద్… ఢిల్లీ నంబర్‌కి కాల్ చేశాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది.ఇదీ విషయం. మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే కట్ చేయండి. ఎట్టిపరిస్థితుల్లో మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.

please share it..
No comments:
Post a Comment