జానీ మాస్టర్ డైరెక్షన్‌లో పవన్ సినిమా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికి తెలియదు. అత్తారింటికి
దారేది సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా కనిపించి అలరించాడు. అయితే ఆ సినిమాలో పవన్ పాత్ర పూర్తిస్థాయిలో లేకపోవటంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఇక పవన్‌కు పదేళ్ల తర్వాత హిట్ ఇచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను సెట్స్‌మీదకు తీసుకు వచ్చేందుకు దాదాపు రెండేళ్లకు పైగా పట్టింది.
గబ్బర్ సింగ్ సీక్వల్ కు డైరెక్టర్ గా సంపత్ నందిని ప్రకటించినా, ఆ తరువాత పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బాబీ దర్శకత్వంలో పవన్ సినిమా అంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు. మరోసారి అలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా సూపర్ ఫాంలో ఉన్న జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడట.
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలైన రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడు లాంటి సినిమాలతో కొరియోగ్రాఫర్ గా టాప్ రేంజ్ కు చేరుకున్నాడు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ డైరెక్టర్‌గా మారేందుకు కొద్ది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో ఉన్న ఆయన ఇటీవలే దాసరి నారాయణరావుకు కథ వినిపించాడు. దాసరి కథ నచ్చటంతో పవన్ హీరోగా తాను నిర్మించాలనుకుంటున్న సినిమాను, జానీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ ప్రపోజల్ కు పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి..
please share it..
No comments:
Post a Comment