దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి -2 మూవీలో చిన్నపాత్రైనా దొరికితే చాలు అనుకునే వారు సినీ ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు. కోలీవుడ్ హీరో సూర్య, నాగార్జున లాంటి వాళ్లయితే బాహుబలి 2లో చిన్న పాత్ర అయినా చేయాలని ఉందని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే బాహుబలి-2 విలన్‌గా లోఫర్ మూవీలో విలన్ కి పెద్ద కొడుకుగా నటించిన చరణ్ దీప్ సుర్నేని.. కాలకేయుడి సోదరుడి పాత్రను పోషించనున్నాడట. బాహుబలి లాంటి భారీ మూవీలో విలన్ రోల్ రావడమంటే.. చరణ్ దీప్ కెరీర్ కి టర్నింగ్ వచ్చేసినట్లే అంటున్నారు. ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో చరణ్ కిలికీ భాష నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట.
బాహుబలి లాంటి చరిత్ర తిరగరాసిన చిత్రంలో చిన్న రోల్ చేస్తే చాలు వాళ్లు టాప్ ప్లేసులోకి వెళ్లిపోతారు. అలాంటి మూవీలో విలన్ కేరక్టర్ అంటే మాటలా ? అందులోనూ బాహుబలి ప్రభాస్ – భల్లాలదేవ రాణా ఒకేవైపు ఉంటే.. వారిద్దరికీ అపొజిషన్‌లో నటించిన ప్రభాకర్ కాలకేయుడిగా మెప్పించగలిగాడు. బాహుబలిలో కాలకేయుడు చనిపోయాడు కాబట్టి.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కాలకేయుడి తమ్ముడిగా చరణ్‌ను తీసుకొస్తున్నారట. ఇలాంటి పాత్రకు సూట్ అయ్యే యాక్టర్ కోసం కొద్ది రోజులుగా జక్కన్న సెర్చింగ్ లో ఉన్నాడని టాక్. చరణ్ దొరకడంతో ఇప్పుడా వెదుకులాటకు ఫుల్ స్టాప్ పెట్టేశాడని అంటున్నారు. బాహుబలి-2 చరణ్ ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.
please share it..
No comments:
Post a Comment