ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే (ఫోటోలు)
ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే ఆనంద్ కుమార్ రోడ్లపై పడుకొనే పశువులను అర్ధరాత్రి దాటిన తర్వాత మెడకింద కోసి చంపేవాడని, అనంతరం వాటిని ఆనవాళ్లు తెలియకుండా తోలు లాగేసేవాడని, మురసటి రోజు వాటిని అమ్మసేవాడని కోరుకొండలో జనం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే కోరుకొండలో గురువారం జరిగిన దారుణ హత్యలు సంఘటనలో మృతులైన వారి కుటుంబాలన్నీ దళిత నిరుపేదలే.
రాజమండ్రి: కోరుకొండ రామచంద్రరావుపేటకు చెందిన ఏడిద ఆనంద్ కుమార్ గురువారం మధ్యాహ్నం పదిహేను నిమిషాల సమయంలో ముగ్గురిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ కుమార్ అసలు ఉన్మాదిగా ఎలా మారాడో చూద్దాం. ఆనంద్ కుమార్ పాత నేరస్థుడు. గతంలో అన్నతో కలిసి రాజమండ్రిలో గొడ్డు మాంసం వ్యాపారం చేసే ఒక మహిళను పట్టపగల హత్య చేశారు. ఏడాది క్రితం ఆనంద్ అన్న విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను తన వృత్తి చేసుకుంటూ భార్యాపిల్లలతో మామూలు జీవితం గడుపుతున్నాడు. ఇటీవలే నాలుగు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన ఆనంద్ అప్పటి నుంచి పనీ పాటా లేకుండా గొడవలు చేస్తూ అల్లరి చిల్లరిగా తిరేవాడు. ఈ క్రమంలో అన్న కుటుంబ సభ్యులతో పాటు కులపెద్దలు అతడిని మందలించారు. బహుశా అది కూడా మనసులో పెట్టుకుని ఉండవచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఒక ఖైదీ తల పగలకొట్టడంతో అతడికి మానసిక వైద్యం కూడా చేయించినట్టు సమాచారం. ఒక వివాదంలో తన అన్నకూతురు ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు కూడా కాల్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కానీ ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబంతో గొడవలేమీ లేవంటున్నారు. ఆమె మాట అక్కడ చెల్లుబాటు కావడంతో ఇవన్నీ మనసులో పెట్టుకుని, ఆనంద్ ఆకస్మికంగా జరిగిన సంఘటనలో రెచ్చిపోయి ఈ హత్యలు చేశాడనే ప్రచారం ఉంది. ఇలా తరుముతుండగా స్థానిక యువకులు మరో నలుగురిపై దాడి చేయబోయాడు. అయితే పేటలోని యువకులు కొందరు పట్టుకుని ఆ ఉన్మాదిని పోలీసులకు అప్పగించారు.

No comments:
Post a Comment