హాస్టల్ భవనంపై నుంచి కింద పడిన విద్యార్థి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని పేట్ బషీరాబాద్‌లో విషాదం జరిగింది. పందేం కోసం ఓ విద్యార్థి వెళ్లి ప్రాణం తీసుకున్నాడు. విద్యార్ధి హాస్టల్ భవనంపై నుంచి కిండపడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన సాయికిరణ్ బీటెక్ చదువుతున్నాడు. పేట్ బషీరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో అవినాష్, సాయికిరణ్ లు సరదాగా పందెం కట్టారు. తమ హాస్టల్ మూడో అంతస్తు పై నుంచి పక్కనే ఉన్న మరో హాస్టల్ భవనంపైకి వెళ్లాలని పందెం కట్టుకున్నారు. మొదటగా అవినాష్ క్షేమంగానే దాటాడు. అనంతరం సాయికిరణ్ దాటుతుండగా పట్టుతప్పి... కింద పడిపోయాడు. సీసీ కెమెరా విజువల్స్ లో మొదట ఓ విద్యార్ధి దూకగా.. తర్వాత సాయికుమార్ దిగటానికి ప్రయత్నించి పడిపోయినట్లు ఉంది. అతని తలకు బలమైన గావడంతో కోమాలోకి వెళ్లాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు
No comments:
Post a Comment