టాలీవుడ్ కు త్రివిక్రమ్ గుడ్ బై
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతున్నారా..! కోలీవుడ్ లో మకాం వేయనున్నారా..! ప్రస్తుతం నితిన్ తో చేస్తోన్న మూవీ “అ..ఆ ” పూర్తవ్వగానే.. ఓ ద్విభాషా
చిత్రానికి సైన్ చేస్తాడని, ఇప్పటికే ప్రాజెక్ట్ కి సంబంధించి త్రివిక్రమ్ అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడని టాక్. సూర్య హీరోగా నిర్మితమయ్యే ఈ సినిమాకు ఇద్దరు ప్రొడ్యూసర్లు అని తెలుస్తోంది. వారిలో ఒకరు సూర్య సన్నిహితుడు జ్ఞానవేల్ రాజా కాగా మరొకరు త్రివిక్రమ్ కి సన్నిహితుడైన హారిక, హాసిని మూవీస్ అధినేత రాధాకృష్ణ (చినబాబు).
త్రివిక్రమ్ చెప్పిన ఓ స్టోరీ లైన్ సూర్యకు బాగా నచ్చడంతో ఈ ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వెనువెంటనే హరి డైరెక్షన్లో ‘సింగమ్ 3’ చిత్రం చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాను పట్టాలెక్కించనున్నాడట సూర్య. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారమ్. ఇఫ్ ఆల్ గోస్ వెల్.. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నాడట త్రివిక్రమ్.
No comments:
Post a Comment