Monday, 21 December 2015

రోజాకు క్లాస్ తీసుకున్న బాలకృష్ణ ?

రోజాకు క్లాస్ తీసుకున్న బాలకృష్ణ ?

444504501420


అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాదికి పైగా సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఊహించని వ్యక్తి క్లాస్ తీసుకున్నాడట. ఆ వ్యక్తి మరెవరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ. అసెంబ్లీ నుంచి రోజా సస్పెండ్ కావడం, ఆ మరుసటి రోజు ఆమె అసెంబ్లీ వచ్చి నానా రభస సృష్టించి అరెస్ట్ కావడం వంటి విషయాలను గమనించిన బాలకృష్ణ… రోజాకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజానికి టీడీపీపై ఎంతగా విమర్శలు చేసినా… బాలకృష్ణ విషయంలో మాత్రం రోజా ఎప్పుడు శ్రుతి మించలేదు. బాలయ్యతో అరడజనుకు పైగా సినిమాల్లో నటించిన రోజాకు ఇప్పటికీ ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయి. బాలకృష్ణ సైతం రోజాతో ఇప్పటికీ ఆప్యాయంగానే మాట్లాడుతుంటారు. అదే సాన్నిహిత్యంలో బాలకృష్ణ రోజాకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం ద్వారా ప్రజల్లో చులకన అవుతావని… ఆ తరువాత నియోజకవర్గంలోనూ గెలిచే పరిస్థితి ఉండదని… దీంతో రాజకీయ భవిష్యత్తు చేజేతులా పాడు చేసుకున్నట్టు అవుతుందని రోజాకు బాలయ్య చెప్పినట్టు సమాచారం. అంతేకాదు… అసెంబ్లీ సమావేశాలకు హాజరై సభకు సారీ చెబితే… అది నీకే మంచిదని కూడా బాలయ్య అన్నారట. విమర్శలు పక్కనపెట్టిన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కూడా బాలకృష్ణ రోజాకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి… బాలకృష్ణ చెప్పిన మంచి మాటలను రోజా వింటుందా లేక తన దారి తనదే అన్నట్టుగా వ్యవహరిస్తుందా అన్నది చూడాలి.

No comments:

Post a Comment