Monday, 21 December 2015

కూతురి కోసం ఆ మండపం వేయించిన రేవంత్

కూతురి కోసం ఆ మండపం వేయించిన రేవంత్



048504805440

తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషా పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. రేవంత్ త‌న కుమార్తె కోరిక మేర‌కు కాంబోడియా దేశంలో ఉన్న ప్రసిద్ధ ఆలయం అయిన అంగ‌కోర్ వాట్ దేవాలయ న‌మూనాలో కల్యాణ మండపాన్ని డిజైన్ చేయించారు. ఇంత‌కీ ఈ దేవాల‌య నమూనాను రూపొందించ‌డానికి అస‌లు కార‌ణం. మాస్టర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి అయిన నైమిషాకు కాంబోడియా టూర్ వెళ్లాలని, అంగ‌కోర్ వాట్ టెంపుల్ ను చూడాలనే కోరిక ఉందట… అదే తన తండ్రితో చెప్పిందట. ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లలేకపోయినా, తన పెళ్లి మండపాన్ని అలా డిజైన్ చేయించాలని కోరిందట.
రేవంత్‌కు కూతురంటే ఎంతో ప్రేమ, ఇక ఆమె నోరు తెరిచి అడిగితే ఆయ‌న‌ కాదంటారా. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ నారాయణరెడ్డికి చెప్పి ఆ దేవాల‌య న‌మూనాలో కల్యాణ మండపాన్ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. రేవంత్ రెడ్డి కూతురు నైమిషా పెళ్లి ఈ నెల 20న హైటెక్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఇక ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన కల్యాణ మండపం డిజైన్ హాట్ టాపిక్ గా మారింది.. రాజమౌళి తీసిన బాహుబలి రేంజ్ లో ఓ సినిమా సెట్ ను రేవంత్ రెడ్డి వేయించారని…ఈ సెట్‌ చాలా బాగుంద‌ని ప‌లువురూ ప్ర‌శంసించార‌ట‌. ఇక వెడ్డింగ్ కార్డ్ విషయంలోనూ రేవంత్ రెడ్డి చాలా కేర్ తీసుకున్నారు… కార్డు పైన కూడా అంగ‌కోర్ వాట్ దేవాలయం బొమ్మను ముద్రించారు. ఆ కార్డు చూడగానే కల్యాణ మండపం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమయ్యేందుకే ఆయ‌న త‌న కుమార్తె పెళ్లి కార్డును అలా డిజైన్ చేయించార‌ట‌.

No comments:

Post a Comment