Monday, 21 December 2015

టాలీవుడ్ లో పది రోజుల్లో 5 మరణాలు

టాలీవుడ్ లో పది రోజుల్లో 5 మరణాలు


ఈ టాలీవుడ్ కు ఏమైంది ఒకవైపు స్కాం , వరుస పరాజయాలు పలుకరిస్తుండగా మరోవైపు వరుస మరణాలు టాలీవుడ్ ని తీవ్ర విషాదం లో ముంచెత్తు తున్నాయి . కేవలం 10 రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన 5 గురు వ్యక్తులు మరణించడం కలకలం సృష్టించింది .సంగీత దర్శకులు  దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణం తో ప్రారంభమైన ఈ చావుల మేళా వరుసగా 5 గురిని పొట్టన పెట్టుకుంది . అదే రోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి అనారోగ్యంతో కన్ను మూయగా ,ఆ తర్వాత మరో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూమ్ లో జారిపడి అపస్మారక స్థితిలో చనిపోయింది . ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు ,పలువురు అగ్ర హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు కూడా అనారోగ్యంతో మరణించడం ఆ తర్వాత 300 కు పైగా చిత్రాల్లో నటించిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది . ఎంతో ధైర్యంగా ఉండే రంగనాథ్ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు . ఇలా వరుస మరణాలు సంవత్సరం ఆఖరులో సంబవించడం తో టాలీవుడ్ లో విషాదం నెలకొంది . 

No comments:

Post a Comment