Thursday, 24 December 2015

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం


ఢిల్లీ: దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం అందిచనుంది. మృతుడి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం కేజీవ్రాల్ ఈమేరకు ప్రకటన చేశారు. ఢిల్లీలోని కర్కార్‌డూమా కోర్టులో నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. మరో కానిస్టేబుల్‌తో పాటు అండర్ ట్రయల్ ఖైదీ గాయపడ్డ విషయం తెలిసిందే.


No comments:

Post a Comment