జీహెచ్ఎంసీ సమరం: ఆ రెంటిలో జనసేనాని దేనికి మొగ్గు చూపుతారు?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంకు ఓ నెల మాత్రమే మిగిలి ఉండగా…రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ గురించి చర్చ జరుగుతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏమిటి అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. వాటిని గమనిస్తే…
సొంతంగా పోటీనా?
తమ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పట్టును తెలుసుకోవడం కోసం జనసేన తమ అభ్యర్ధులను దించనుందా? లేదా? అన్న దానిపై ప్రముఖంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయ సన్నిహుతులతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే…గ్రేటర్ ఎన్నికలు వేడెక్కడం ఖాయమే.
ఎన్డీయే కూటమికి మద్దతా?
జన సేన సొంతంగా పోటీ చేయని పక్షంలో…టీడీపీ-బీజేపీ కి ప్రచారం చేయడం చేయోచ్చనే వార్తలూ వస్తున్నాయి. పవన్ తో ప్రచారం చేయించుకోవడం కోసం…ఇప్పటికే టీడీపీ-బీజేపీ నాయకులు పవన్ తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
అయితే…పవన్ గ్రేటర్ ఎలెక్షన్లలో పోటీ చేయకపోవచ్చని…దానికి కారణం ప్రచారానికి కావాల్సిన ఆర్ధిక వనరుల లోపమే కాకుండా…ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలపై దృష్టిపెట్టడం కారణమని మరి కొంతమంది అంటున్నారు.
మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎలెక్షన్ల కు సంబంధించి త్వరలో పవన్ నుంచి తన అభిప్రాయం వచ్చే అవకాసం ఉంది.
No comments:
Post a Comment