Saturday 6 February 2016

కాపురంలో చిచ్చుపెట్టిన ఫేస్ బుక్

40850450210

సోష‌ల్ మీడియా ఈ రోజు ప్ర‌పంచాన్ని ఓ కుగ్రామంలో మార్చేసింది. ఖండాలు, దేశాల హ‌ద్దులు చెరిపేసింది. చాలామంది ఫేస్‌బుక్‌, ట్వీట్ట‌ర్ల‌ను ఈ రోజు ఓ నిత్యావ‌స‌రంగా వాడుకుంటున్నారు. ఇవి ఓ వైరస్‌లా మారిపోయాయి. రోజుకు కనీసం ఒక్కసారైనా ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా ఉండనివారు కోట్లలో ఉంటున్నారు. అయితే ఇవి ఎంతో దూరాన ఉన్న‌వాళ్ల‌ను ఎలా క‌లుపుతున్నాయో…ఎలా స్నేహితుల‌ను చేస్తున్నాయో…కొంద‌రిని అంతే దూరం చేస్తున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఫేస్‌బుక్ కారణంగా ఓ జంట విడిపోయేందుకు సిద్ధమైంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా ఇష్టం. ఐతే ఈ దంప‌తులిద్ద‌రు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఈ ఇద్ద‌రికి ఫేస్‌బుక్‌లో వేర్వేరు ఐడీల‌తో ఖాతాలున్నాయి. అనుకోకుండా ఈ ఫేక్ ఐడీలతోవున్న ఈ జంట మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇద్దరు మ్యారేజ్ కాలేదని చెప్పుకున్నారు. మరింత దగ్గరయ్యారు. ఒక‌రి ర‌హ‌స్యాల‌ను మ‌రొక‌రు చెప్పుకున్నారు
ఆరె నెల‌ల త‌ర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ మంచి రోజు చూసుకుని వీరు క‌లుసుకున్నారు. తీరా వీరు క‌లుసుకున్నాక అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. తాము భార్త‌భ‌ర్త‌ల‌మే అని…అయితే ఇంత జ‌రిగాక‌…ఒక‌రిపై మ‌రొక‌రికి న‌మ్మ‌కం లేక‌పోయాక కలిసి జీవించలేమని ఓ నిర్ణయానికి వచ్చేశారు. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సంఘ‌ట‌న‌తో అయినా సోష‌ల్ మీడియాలో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అంతే స్థాయిలో ప్ర‌మాదం కూడా ఉంద‌న్న విష‌యాన్ని నెట్ యూజ‌ర్లు గుర్తిస్తే మంచిది.

No comments:

Post a Comment