Saturday, 6 February 2016

సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో మ‌రో స్టూడెంట్ సూసైడ్‌

05909015632030

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌రో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై పెను వివాదం చెలరేగిన కొద్దిరోజుల్లోనే.. మరో పీహెచ్‌డీ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవ‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది. ఈసారి రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంఘ‌ట‌న‌కు వేదిక‌గా మారింది. యూపీకి చెందిన 27 ఏళ్ల మోహిత్ చౌహాన్ అనే విద్యార్థి తన హాస్టల్ రూంలోనే ఉరేసుకున్నాడు. ప్రొఫెసర్ వేధింపుల కారణంగానే చౌహాన్ బాగా డిప్రెస్ అయ్యాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అతడి క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్న మాట.
సాయంత్రం వరకు హాస్టల్ ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడాడు. డిన్నర్ కోసం చౌహాన్‌కు ఫోన్ చేసినా సరైన ఆన్సర్ రాలేదని, చివరకు రూమ్‌కి వెళ్లి చూస్తే అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వెంటనే ఫ్రెండ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చౌహాన్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హాస్టల్ గదికి చేరుకుని కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత విద్య చదివే వారు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం.

No comments:

Post a Comment