Tuesday 2 February 2016

సర్ధార్ అంటేనే పరిగెడుతున్న డిస్ట్రిబ్యూటర్స్

07804501201185

ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు వరుసగా సక్సెస్ ని సాధిస్తున్న మూవీలే. బాహుబలి మూవీ తరువాత ఇప్పటి వరకూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలు దాదాపు 70 శాతంకి పైగా సక్సెస్ ని చూశాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, బయ్యర్స్, థియోటర్ యజమానులు అంతా లాభాలు చూస్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్స్ కి కొత్త కొత్త ఆశలు, ఉత్సాహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా బారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ మూవీ పేరు చెప్పగానే డిస్ట్రిబ్యూటర్స్ కి పూనకం వచ్చినట్టు అవుతుంది. ఈ మూవీని ఎంత రేటుకయినా ధక్కించుకోవాల్సిందే అన్నట్టుగా వారు తెగ పోటీపడుతుంది. ఏదైనా ఏరియాలో సర్ధార్ మూవీ రైట్స్ ఉన్నాయని తెలుసుకోగానే….ఆ ఏరియా రైట్స్ ని చేజిక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ పరుగులు పెడుతున్నారు. పవన్ మూవీ కాబట్టి కచ్ఛితంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని వీరి అభిప్రాయం. ఇక ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా కనిపించనున్న సినిమా కూడ సర్ధార్ కావటంతో, ఈ మూవీపై భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో థియేటర్లలో సందడి చేయనుంది. విడుదలకు మూడు నెలలు ఉండగానే బిజినెస్ అధరగొడుతుంది. ఇక కేవలం రెండు, మూడు ఏరియాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రమే కాళీగా ఉన్నాయి. మిగతా ఏరియాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి.

No comments:

Post a Comment