Monday, 11 January 2016

ఫ్రీ రివ్యూ: నాన్న‌కు ప్రేమ‌తో

5840501450120

సినిమా: నాన్న‌కు ప్రేమ‌తో
జాన‌ర్‌: స‌్టైలీష్ రివేంజ్ డ్రామా
న‌టీన‌టులు: య‌ంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, జ‌గ‌ప‌తిబాబు,
రాజేంద్ర‌ప్ర‌సాద్‌, హేబా ప‌టేల్‌, రాజీవ్ క‌న‌కాల‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర సినిమా చిత్ర – రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఆర్ట్‌: ర‌వీంద‌ర్‌
యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్‌చ‌క్ర‌వ‌ర్తి
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌
నిర్మాత‌: భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌
ఎగ్జిగ్యూటీవ్ ప్రొడ్యుస‌ర్‌: సుధీర్‌
క‌థ‌-స్ర్కీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌
సెన్సార్ రిపోర్ట్‌: U/A
రిలీజ్ డేట్‌: 13 జ‌న‌వ‌రి, 2016
2001లో ఉషాకిర‌ణ్‌మూవీస్ నిన్నుచూడాల‌ని సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో తిరుగులేని నెంబ‌ర్‌వ‌న్ ప్లేసుకు చేరుకున్నాడు. తాత రూపం ఉట్టిప‌డ‌డంతో ఎన్టీఆర్ ఈనాటి తార‌క‌రాముడిగా త‌క్కువ టైంలోనే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 24 సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్‌కు తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో 25వ చిత్రం. ఎన్టీఆర్ కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సినిమాపై కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో హాట్ హాట్ డిస్క‌ర్ష‌న్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ సినిమాల‌లో నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు రిలీజ్‌కు ముందు వ‌చ్చిన బ‌జ్ ఏ సినిమాకు రాలేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ సినిమా ట్రైల‌ర్లు, టీజ‌ర్ల‌తో పాటు ఆడియోకు విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే ఈ సినిమా టాలీవుడ్ హిస్ట‌రీలోనే స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక కొంత కాలంగా త‌న స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ టెంప‌ర్‌తో ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ సినిమా ఎన్టీఆర్ స్థాయికి త‌గిన హిట్ కాలేదు. దీంతో నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో పాత రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాయాల‌న్న క‌సితో ఉన్న ఎన్టీఆర్ ఉన్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 13న వ‌స్తున్న నాన్న‌కు ప్రేమ‌తో సినిమా స్టోరీ ఎలా ఉండ‌బోతోంది…ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు ఏమిటి ? ఈ సినిమాకు ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల గురించి డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ ఫ్రీ రిలీజ్ రివ్యూలో చూద్దాం.
నాన్న‌కు ప్రేమ‌తో స్టోరీ ఎలా ఉండ‌బోతోంది…
హీరో ఎన్టీఆర్‌కు నాన్నంటే విప‌రీత‌మైన అభిమానం…నాన్న కోసం ఏదైనా చేసే ఆ యువ‌కుడు నాన్న ఆఖ‌రి కోరిక‌ను నెర‌వేర్చేందుకు ఏం చేశాడు ? అస‌లు హీరో నాన్న ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? అందుకు కార‌ణాలేమిటి ? త‌న తండ్రి క‌ష్టాల్లో చిక్కుకోవ‌డానికి కార‌ణ‌మైన వాళ్ల‌ను ఎన్టీఆర్ ఏం చేశాడు ? జ‌గ‌ప‌తిబాబుతో ఎన్టీఆర్ మైండ్‌గేమ్ ఎందుకు ఆడాల్సి వ‌చ్చింది..? లండ‌న్‌లో వీధుల్లో హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌తో ప్రేమ డ్యూయెట్లు ఎలా పాడాడు ? లాంటి అంశాల‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందట. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయ‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా నాన్న సెంటిమెంట్ ఈ సినిమాలో మెయిన్ స్టోరీ లైన్ కానుంది.
న‌టీన‌టుల పెర్పామెన్స్ అంచ‌నాలు:
ఈ సినిమాలో న‌టీన‌టుల్లో ముందుగా ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే…
ఎన్టీఆర్ స్టైలీష్ యాక్టింగ్‌:
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ స్టిల్స్ పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఎన్టీఆర్ త‌న కేరీర్‌లోనే చాలా స్టైలీష్ గెట‌ప్‌లో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్ స్టైలీష్‌లుక్స్‌తో పాటు ట్రైల‌ర్లు, టీజర్ల‌లో స్టైలీష్ డ్యాన్సులు, డైలాగులు చూస్తుంటే ఇది వర‌కెన్న‌డు చూడ‌ని ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో చూస్తున్న‌ట్టు క్లీయర్‌గా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్‌లో ప్ర‌తి కోణంలో స్టైలీష్ యాంగిల్ సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది.
ఇక ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కూడా సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న క‌రెక్ట్‌గా సెట్ అయిపోయింది. ర‌కుల్-తార‌క్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్ల‌తో వీరి మ‌ధ్య కెమిస్ర్టీ కేక పెట్టించేలా ఉంద‌ని టాక్‌. లండ‌న్‌లో ఫ‌స్టాప్‌లో జ‌రిగే ల‌వ్‌స్టోరీ యూత్‌, అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉండ‌బోతోంది. ఇక ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయాడ‌ని చిత్ర‌యూనిట్ స‌మాచారం. రాజేంద్ర‌ప్ర‌సాద్‌-తార‌క్ మ‌ధ్య వ‌చ్చే సీన్లు…చివ‌ర్లో ఎమోష‌న‌ల్ సీన్లు, తార‌క్‌-నెగిటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ పోషిస్తున్న జ‌గ‌ప‌తిబాబు మ‌ధ్య వ‌చ్చే మైండ్‌గేమ్ సీన్లు సూప‌ర్బ్ అని టాక్‌.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ వ‌ర్క్ ఎక్స్‌పెక్టేష‌న్స్ :
ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లోనే సినిమాటోగ్ర‌ఫీ ఎలా ఉందో తెలిసిపోతోంది. విజ‌య్‌చ‌క్ర‌వ‌ర్తి విజువ‌ల్స్ వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ కొత్త‌గా ఉండ‌నున్నాయి. రాకింగ్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఆల్బ‌మ్ ఇప్ప‌టికే తెలుగు శ్రోత‌ల‌కు క‌నెక్ట్ అయ్యింది. ఆల్బ‌మ్‌లోని ఐదు పాట‌లు సూప‌ర్బ్‌గా ఉన్నాయ‌న్న టాక్ వ‌స్తోంది. ఎన్టీఆర్ పాడిన ఐవన ఫాలోయు పాట ఇప్పుడు రింగ్‌టోన్ల‌లో తెర మార్మోగుతోంది. ఓ ప్రొఫెష‌న‌ల్ సింగర్ స్టైల్లో ఈ సాంగ్‌ను పాడిన ఎన్టీఆర్ సినిమాపై అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెంచేశాడు. ఇక శోభ‌న్‌బాబుతో డ్రైవ‌ర్‌రాముడు సినిమాతో నిర్మాత‌గా మారి భారీ చిత్రాల పంపిణీదారుడిగా టాలీవుడ్‌లో పేరున్న టాప్ ప్రొడ్యుస‌ర్ బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ సినిమాకు లెక్క‌కు మిక్కిలిగా డ‌బ్బు ఖ‌ర్చు చేసి బెస్ట్ అవుట్ ఫుట్ వ‌చ్చేందుకు రాజీ ప‌డ‌లేదు. దాదాపు రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ రివేంజ్ డ్రామా స్టోరీ అత్యంత స్టైలీష్‌గా తెర‌కెక్కింది. ఈ విష‌యంలో ప్ర‌సాద్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
సుకుమార్ డైరెక్ష‌న్ అంచ‌నా :
టాలీవుడ్‌లో సుకుమార్ పేరు చెపితేనే ప్ర‌యోగాలకు పెట్టింది పేరు. విభిన్న‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్పాటు చేసుకున్న సుకుమార్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాను టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఓ విభిన్న‌మైన సినిమాగా తెర‌కెక్కించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తి కొడుకు త‌న తండ్రి ప‌ట్ల ఎలాంటి బాధ్య‌తతో ఉండాల‌న్న‌దే ఈ సినిమా కాన్సెఫ్ట్‌గా క‌న‌ప‌డుతోంది. సుకుమార్ సినిమాల‌లో స్ర్కీన్‌ప్లే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇక త‌న‌దైన స్టైల్లో చాలా స్టైలీష్ మూవీగా ఈ సినిమాను సుకుమార్ డీల్ చేశాడు. వ‌న్ లాంటి ప్లాప్ త‌ర్వాత చాలా కేర్ తీసుకుని సుక్కు ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో పాటు సినిమా హిట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. ఇటీవ‌లే సుకుమార్ ర‌చ‌న & ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌చ్చిన కుమారి 21 ఎఫ్ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డం కూడా సుకుమార్‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది.
ఫ్ల‌స్‌ల అంచ‌నా
– ఎన్టీఆర్ స్టైలీష్ యాక్టింగ్‌, డ్యాన్సులు, డైలాగ్స్‌
– డిఫ‌రెంట్ స్టైల్ స్టోరీ ప్ర‌జెంటేష‌న్‌
– సినిమాటోగ్ర‌ఫీ అండ్ ఆల్ టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌
– సినిమాకు ముందే దేవిశ్రీప్ర‌సాద్ సూప‌ర్బ్ మ్యూజిక్
మైన‌స్‌ల అంచ‌నా
– స్లో న‌రేష‌న్‌
– పేప‌ర్ మీద వ‌ర్క్ స‌రిగా ఉన్నా తెర‌మీద‌కు వ‌చ్చే స‌రికి మారిపోయే సుకుమార్ ఆలోచ‌న‌లు
ఫ్రీ రిలీజ్ బిజిజెస్‌:
రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోను అదిరిపోయే స్థాయిలో బిజినెస్ అయ్యింది. రెండు తెలుగు రాష్ర్టాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా బ‌డా డిస్ర్టిబ్యూట‌ర్లు నాన్న‌కు ప్రేమ‌తో రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 13న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1700 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిల‌య‌న్స్ సంస్థ విడ‌దుల చేస్తోంది. సినిమాపై బ‌య్య‌ర్ల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
ఫైన‌ల్‌గా…
ఎన్టీఆర్ కేరీర్‌లోనే ఎన్నో అంచ‌నాల‌తో వ‌స్తున్న నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ఫ‌స్ట్ కాపీ చూసిన‌ దుబాయ్ సెన్సార్ బోర్డు అధికారికంగా రివ్యూ రిపోర్ట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ లో మెంబర్ అయిన కైరాసాంధు ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాలేదని , చాలా మంచి సినిమా అని , ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఆమె ట్వీట్ చేసిన పద్ధతిని బట్టి చూస్తే , ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సంక్రాంతికి బరిలో దిగే అన్ని సినిమాల్లో కెల్లా ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని, ఇక రిలీజయ్యి హిట్ రావడం లాంఛనమేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ న‌మ్మ‌కంతో ఉన్నారు. సో ..సినిమాపై అంద‌రి అంచ‌నాలు భారీగా ఉండ‌డంతో సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి టాక్ వ‌చ్చింది. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా హిట్ అయ్యి ఎన్టీఆర్‌కు లోటుగా ఉన్న రూ.50 కోట్ల క్ల‌బ్ కోరిక తీర్చ‌డంతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో నూత‌నోత్తేజం నింపాల‌ని కోరుకుంటూ…ఈ సినిమా హిట్ అవ్వాల‌ని టోట‌ల్ చిత్ర యూనిట్‌కు డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ ముంద‌స్తు శుభాకాంక్ష‌లు.
నాన్న‌కు ప్రేమ‌తో సినిమా రివ్యూ, ఫ‌స్ట్ షో టాక్‌, ఫ్ల‌స్‌(+), మైన‌స్‌(-)లు ఇత‌ర పూర్తి వార్త‌ల కోసం చూస్తేనే ఉండండి డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్‌

No comments:

Post a Comment