Monday 28 December 2015

టీడీపీకి నిజమైన వారసుడు హరికృష్ణ?

టీడీపీకి నిజమైన వారసుడు హరికృష్ణ?


తన తండ్రి పెట్టిన ” తెలుగు దేశం పార్టీ కోసం, తన తండ్రి గౌరవం కోసం ” తన కుటుంబాన్ని వదులుకొని 35 సంవత్సరాలు ఓ కొడుకు ఏం చేశాడో … ఆ గొప్పదనాన్ని నటుడు నందమూరి కల్యాణ్ రామ్ వివరించాడు. దీనికి యన్టీఆర్ నటించిన ” నాన్నకు ప్రేతో ” సినిమా ఆడియో ఫంక్షన్ వేదికైంది.
తండ్రి యన్టీఆర్ గౌరవం కోసం, ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి భుజాలపై తన తండ్రి నందమూరి హరికృష్ణ ఎలా మోశాడో కల్యాణ్ రామ్ చెప్పినట్లయ్యింది. టీడీపీ పార్టీ నారా చంద్రబాబు, నారా లోకేష్ చేతుల్లో వెళ్ళడంపై బాధను, ఆవేదనను పరోక్షంగా వెలుబుచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ పార్టీలో నందమూరి హరికృష్ణ కుటుంబ స్థానం, హక్కు గురించి, పార్టీకి దూరం చేసే ప్రయత్నాలను తన అంతరంగ మాటల ద్వారా కల్యాణ్ రామ్ ప్రశ్నించినట్లయ్యిందని పలువురు భావిస్తున్నారు. ఈ మాటలు టీడీపీ వర్గాల్లో ఆలోచనలో పడేశాయని చెప్పొచ్చు. హరికృష్ణ సారథ్య చైతన్యరథం మీదే మొత్తం నిర్విరామ షెడ్యూల్ తో యన్టీఆర్ పార్టీ ప్రచారం సాగిస్తూ … ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో కేవలం పార్టీ పెట్టి 9 నెలలకే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తూ అధికారం పొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే !
నందమూరి కల్యాణ్ రామ్ అసలు ఏం మాట్లాడారు … ఆయన మాటల్లోనే – 
” ఒక కొడుకు వాళ్ల నాన్న మీద ప్రేమతో ఏం చేసాడని అనేది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు ఇక పుట్టడు ! మా తాత గారి కోసం లక్ష కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపారు. ఏ కొడుకైనా పెళ్లయి తన పిల్లలతో జీవితం తాను సాగిస్తున్న ఈ సమాజంలో … 35 సంవత్సరాలు ఓ తండ్రి కోసం, తండ్రికి తోడుగా ఇంత ‘ డెడికేటెడ్ ‘ ఉన్న కొడుకునెప్పుడూ చూడలేదు. ఇలాంటి తండ్రి కొడుకులుండడం మా అదృష్టం. కానీ నిజంగా మేము మా తండ్రికి ఇలా చేయలేక పోతున్నామే అన్న బాధ కలుగుతుంది. మా నాన్న … వాళ్ళ నాన్నను ఎలా కంటికి రెప్పలా చూసుకున్నారో మాకు తెలుసు.
ఒకసారి తాత గారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి ప్రొద్దున్నే ఆంధ్రప్రదేశ్‌లో స్పీచ్ కోసం ఇవ్వడానికి రావాలని … చైతన్య రథం డ్రైవర్ గా ఉన్న మా నాన్న గారిని ఎల్లుండి ఉదయంకంతా హైదరాబాద్‌కు వస్తా. నీవు చైతన్య రథం తీసుకొని స్టేషన్‌కు రాగలవా? అని అడిగాడు … సుమారు 900 కిలోమీటర్లు నిద్రాహారాలు మాని ప్రొద్దున్నే రైల్వే స్టేషన్‌కు వచ్చి తన తండ్రి గారిని ఎక్కించుకున్నారు. ఎంత మంది కొడుకులు ఇలా పని చేయగలరు? ఆ చైతన్య రథాన్ని ఈ రోజున చూస్తే పొరపాటున కూడా తోలరు. నడుములు పోయి, కాళ్లకు బొబ్బలెక్కినా తన తండ్రి కోసం అలాగే చేసేవారు. ఇవన్నీ నా తమ్ముడు తారక్ కూడా తెలుసు 
కల్యాణ్ రామ్ ప్రసంగాన్ని కూడా వీడియోలో చూడొచ్చు …
https://www.youtube.com/watch?v=bXgR3azA40U 
for video

No comments:

Post a Comment