Wednesday 10 February 2016

జోక్ చేసి జైలుకెళ్లిన ప్రియురాలు

0480450120120

ప్రియుడు- ప్రియురాలు మ‌ధ్య‌ ముచ్చ‌టైన క‌బుర్లు, ముద్దులు, స‌ర‌సాలు, జోక్‌లు, కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డం మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం ఇవ‌న్నీ మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు స‌ర్వ‌సాధార‌ణమైన విష‌యాలే… అంద‌రికీ తెలిసిన విష‌యాలే. అయితే ఓ ప్రియురాలు ప్రియుడిపై జోక్ వేసి జైలుకెళ్లింది. ప్రియుడిపై జోక్ చేస్తే ఆమెకు శిక్ష విధించ‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా ? ఇంత‌కీ ఆమె చేసింది మామూలు జోక్‌ అయినా ప్రియుడు మాత్రం దాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. లైసెన్స్ ఉన్న టెలీకమ్యూనికేషన్ వ్యవస్థని దుర్వినియోగం చేసిందని ప్రియురాలి మీదే కేసు పెట్టాడు. కెన్యాలోని నైరోబీలో ఈ విచిత్ర ఘటన జరిగింది.


ఎమిలీ కరిమి అనే యువతి తన ప్రియుడు జార్జ్ బురుగుకు ఓ మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందనే కదా మీ అనుమానం. తనతో డేట్‌కి రమ్మని అడిగిన జార్జ్ బురుగుకు.. అతని పురుషాంగం చిన్నదంటూ.. మగతనాన్ని వేళాకోళం చేస్తూ ఎమిలీ మెసెజ్ చేసింది. ఆమె జోక్‌గానే అలా పంపిన‌ప్ప‌టికీ .. అతగాడికి మాత్రం చాలా కోపం వ‌చ్చింద‌ట‌. ఆమె పంపిన మెసేజ్‌తో ఆగ్రహం చెంది ఆమెపై కేసు పెట్టాడు. అత‌గాడి ఫిర్యాదుతో ఎమిలీని అరెస్టు చేసిన పోలీసులు అనంత‌రం ఆమె సొంత పూచీకత్తుతో ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. ఇదండీ సంగ‌తి.. కెన్యాలో చాలా జాగ్ర‌త్త‌గా మెసేజ్‌లు వేయాల‌ని అర్థ‌మ‌య్యేలా చేశాడు ప్రియుడు బురుగు.

No comments:

Post a Comment