Wednesday 10 February 2016

ఊరుకెళ్లే రోడ్డు బాగోలేద‌ని హెలీకాప్ట‌ర్ త‌యారు చేశాడు

5458014501201

గ్రామంలోకి వ‌చ్చే రోడ్డు బాగోలేద‌నే కార‌ణంతో చంద్ర సివోక్తి శర్మ అనే మెకానిక్ హెలికాప్ట‌ర్‌ను త‌యారుచేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సాధార‌ణంగా రోడ్డు బాగోక‌పోతే ప్ర‌భుత్వ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తాం. రోడ్డు వేయ‌కుంటే ధ‌ర్నా చేస్తాం. వీలైనంత వ‌ర‌కు రోడ్డుకు మ‌ర‌మ్మ‌తులైన చేప‌ట్టండి అంటూ అధికారుల‌ను అడుగుతాం. కానీ, అసోంలో ఓ మెకానిక్ మాత్రం పై వాటిల్లో ఏ పనీ చేయలేదు. తన మేధస్సుకు పదును పెట్టాడు. రహదారి కూడా సరిగా లేని తన గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఎలాంటి చిక్కులు లేకుండా వెళ్లేందుకు ఏకంగా హెలికాప్టర్ నే తయారు చేసుకున్నాడు.
అసోంలోని శ్యాంజులి అనే ఎజెన్సీ గ్రామానికి చెందిన చంద్ర సివోక్తి శర్మ అనే వ్యక్తి మెకానిక్ గా పనిచేస్తున్నాడు. వారిది పేద కుటుంబం. సివోక్తి శర్మ పెద్దగా స్కూల్ కి కూడా వెళ్లేవాడు కాదు. కానీ, అతడు చేసిన ఆవిష్కరణ ముందు మాత్రం ఎలాంటి డిగ్రీలు, పట్టాలు కూడా సాటిరావని నిరూపించాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కూడా నూతన ఆవిష్కరణలు చేయాలని, వాటికి ప్రతి ఒక్కరు స్వాగతం పలకాలని ప్రతి కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే. అతడు ఈ స్లోగన్ ను ఆదర్శంగా తీసుకున్నాడో లేక, తన గ్రామ పరిస్థితిని అధిగమించాలనుకున్నాడో.. మొత్తానికి సొంతంగా ఓ హెలికాప్టర్ ను తయారు చేసుకోవడంతోపాటు దాన్ని గాల్లో కూడా ఎగిరించాడు. దీని నిర్మాణం కోసం అతడు చేసిన ఖర్చు 15లక్షల రూపాయలు. ఈ హెలికాప్టర్ ఇద్దరు వ్యక్తులను 30 నుంచి 50 అడుగుల ఎత్తులో తీసుకెళ్లగలదని మెకానిక్‌ మీడియాతో తెలిపాడు.

No comments:

Post a Comment