Wednesday 10 February 2016

ఫేస్ బుక్ తాజా టార్గెట్ ఇదే..

04804501201088

సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌కు ఒక ప్ర‌త్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్ర‌పంచంలోనే ఫేస్‌బుక్ నెటిజ‌న్ల ప్ర‌జాద‌రణ పొంది సరికొత్త విప్లవాన్ని తెచ్చింద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. 2030 నాటికి ప్ర‌పంచంలో 500 వంద‌ల కోట్ల మంది ఫేస్‌బుక్‌లో ఖాతాదారుల‌ను చేయాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని ఫేస్ బుక్ సృష్టికర్త.. సీఈవో మార్క్‌జుకర్‌బర్గ్ అన్నారు. కాలిఫోర్నియాలో నిర్మించిన ఫేస్‌బుక్‌ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంలో ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఫేస్ బుక్ వాడేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు (1.5బిలియన్‌) మంది. ప్రతిరోజూ ఫేస్ బుక్ చూడని నెటిజన్ లేరంటే నమ్మాల్సిందే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఫేస్ బుక్ లో అకౌంట్ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఫేస్‌బుక్‌తోనే యువ‌త ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డిపే స్థితిలో ఉన్నారు. విద్యార్థులు కూడా ఎక్కువ టైమ్ ఫేస్‌బుక్‌లో స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫేస్ బుక్ లో లీన‌మైపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్రతి ఒక్కరినీ ఫేస్‌బుక్‌తో కనెక్ట్‌ చేయాలని.. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని జుక‌ర్‌బ‌ర్గ్ త‌న‌ కంపెనీ ఉద్యోగులకు సూచించారు.

No comments:

Post a Comment