Monday 8 February 2016

ఫేస్‌బుక్ పోస్ట్ కి స్పందించిన బెజవాడ కమిషనర్

804501208470120

సామాజిక మాధ్య‌మాలతో నష్టాలే కాదు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్విట‌ర్‌, ఫేస్‌బుక్ ల‌లో ప్ర‌భుత్వ అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. ఇలా బాధితుల పోస్టుల‌కు స్పందించి వారి స‌మ‌స్య‌ను అధికారులు స్పందించ‌డంలో ముందుంటున్నారు. ఇప్పుడు ఒక వృద్దురాలి స‌మ‌స్య‌ను ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకుని, ప‌రిష్క‌రించి మాన‌వ‌తా వాదాన్ని చాటుకున్నారు బెజ‌వాడ క‌మిష‌న‌ర్‌.
శ‌నివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం లో బెజావాడ లో ఒక వృద్దురాలి ఇంటి ప్రహరిని కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీ కోసం కూల్చేశారు. అయితే ప‌ని పూర్త‌యిన త‌ర్వాత తిరిగి నిర్మించ‌లేదు. విషయం తెలసిన వీరభద్ర శాస్ర్తీ అనే సిటిజన్ వృద్ధురాలికి సాయం చేయాల‌ని ఫేస్‌బుక్ ద్వారా అడిగారు. దీనికి స్పందిచిన స‌తీష్‌, రియాజ్‌ గోరా, రాజ కొంద‌రు ఈ విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటుచేశారు. అయితే విజ‌య‌భాస్క‌ర్ అనే వ్యక్తి వాల్ పై ఈ విషయాన్ని గమనించిన క‌మిష‌న‌ర్ వీర పాండియ‌న్ ఫేస్‌బుక్‌ పోస్ట్ కి స్పందించారు. ఈ స‌మ‌స్య త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌ర్వాత రోజు ఉద‌యాన్నేఎనిమిది గంటల కల్లా కమిషనర్ వీర పాండియ‌న్ ఈ సమస్య పై అప్ డేట్ ఇచ్చారు. ఆ ఇంటి ముసలావిడ తో మాట్లాడారు. విజయవాడ కార్పొరేషన్ ఇంజనీర్ల బృందం సంఘటన స్థలానికి వెళ్లడం.. కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం… పడగొట్టిన ప్ర‌హరీ తిరిగి పునర్నిర్మించడం మొదలుపెట్టారు. వాటిని ఫొటోల‌తో స‌హా కమిషనర్ పోస్ట్ చేశారు.
ఇలాంటి నిబద్దత కలిగిన అధికారులు ఉండటం అరుదు తక్షణం స్పందించడమే కాక తిరిగి అప్ డేట్ చేయడం ఆయన లోని స్పందన సున్నితత్వం ప్రజలపట్ల ఉన్న గౌరవం తెలియచేస్తున్నాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఈరోజుల్లో కూడా ఇటువంటి అధికారులు ఉండ‌టం చాలా అరుదు మ‌రి. ఇలా స్పందించే అధికారులు ఉంటే ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ ఉండ‌వు.

No comments:

Post a Comment