Wednesday 10 February 2016

2019 ఎన్నిక‌లు కొత్త ట్విస్ట్‌

05102102120

రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ‌ప‌డుతున్న ప‌లువురు ఆశావాహుల‌కు షాక్ త‌ప్పేలా లేదు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతేనని లోక్‌సభ‌లో వైకాపా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీం జైదీని కలిశారు.
జైదీని క‌లిశాక మేక‌పాటి మీడియాతో మాట్లాడారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెంచాల‌న్న రూల్ ఉన్నా ఎప్పుడ‌నేది స్ప‌ష్ట‌త లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే అన్ని రాష్ర్టాల్లోను పెంచాల్సి ఉంటుంద‌ని… 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన వీలుపడదని అటార్నీ జనరల్ కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీలో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 225కు, తెలంగాణ‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 119 నుంచి 153కు పెంచాల‌ని పేర్కొన్నారు. ఈ లెక్క‌న ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో 7గా ఉన్న అసెంబ్లీ స్థానాల‌ను 9కు పెంచాల్సి ఉంటుంది. అయితే 2026 వ‌ర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉండ‌ద‌న్న విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు పెరిగితే ఎమ్మెల్యేగా పోటీ చేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకున్న చాలా మందికి నిరాశ త‌ప్పేలా లేదు.

No comments:

Post a Comment