Friday 5 February 2016

శ్రీజ కొత్త పెళ్ళి కొడుకు వివరాలు తెలిసాయా?

080250108042

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే విషయం తెలిసిందే. ఈ ముచ్చట్ల వివరాలకి వస్తే, ఛిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నుండి చిరు ఫ్యామిలీతోనే శ్రీజ ఉంటూ, ఉన్నత చదువులను కూడా పూర్తి చేసుకుంది. గత కొంత కాలం నుండి శ్రీజని మళ్ళీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించాల్సిందిగా చిరు అభిప్రాయపడుతున్నాడంట. అందుకు శ్రీజ తన మనస్సులోని మాటని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. ఇప్పడు రీసెంట్ గా తను తీసుకున్న నిర్ణయం ప్రకారం, చిరు శ్రీజని పెళ్లి గురించి అడిగితే తను కూడా గ్రీన్ సిగ్నల్ చెప్పడంతో.. శ్రీజకి పెళ్లి చేసే పనిలో చిరు రెడీ అయ్యారు. ఇక చిరు వియ్యంకుల వారి వివరాలను చూస్తే, చిత్తూరుకి సంబంధించిన ఓ బిజినెస్ మెన్ తో శ్రీజ పెళ్ళి జరగనుందని అంటున్నారు. అలాగే వీరు చిరంజీవి ఫ్యామిలీకి దగ్గరి బందువులు అనే సమాచారం కూడ తెలుస్తుంది. మార్చిలో గ్రాండ్ గా ఈ పెళ్లి చేయడానికి చిరు ఫ్యామిలీ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ విషయంలో వపన్ కళ్యాణ్ సలహాని కూడ చిరంజీవి తీసుకోనున్నాడు. పవన్ కళ్యాణ్ సైతం కొన్ని రోజుల క్రితం శ్రీజ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని తను కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే మరి కొద్ది రోజుల్లోనే చిరు ఇంట్లో పెళ్ళి అంగరంగ వైభవంగా జరగనుందని అంటున్నారు.

No comments:

Post a Comment