Friday 5 February 2016

చ‌ంద్ర‌బాబుతో ప‌వ‌న్ దోస్తీకి క‌టీఫ్?

pawan-kalyan-babu-2872

‘‘మనం నమ్మిన పార్టీ విధానాలు దేశానికి అనుకూలంగా ఉన్నంత కాలం ఆ..పార్టీతో ఉంటాం.
విధానాలకు భిన్నంగా ప్రవర్తించినపుడు కూడా ఆ పార్టీతోనే ఉంటే మనం నేరం చేస్తున్నట్టే లెక్క”
– రాంజెఠ్మలాని, ప్ర‌ముఖ న్యాయ‌వాది
ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పవన్ ట్వీట్ చేశాడు. అంటే టీడీపీకి ప‌వ‌న్ గుడ్ బై చెబుతున‌ట్లేనా..? చ‌ంద్ర‌బాబుతో దోస్తీకి క‌టీఫ్ చెప్పిన‌ట్లేనా? ఔన‌నే అంటున్నాయ్ ప‌రిణామాలు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో టీడీపీ చేప‌డుతున్న భూ సేక‌ర‌ణ‌పై గ‌త కొద్దికాలంగా జ‌న‌సేనాని గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే! తాను వ‌ద్దంటున్నా ప్ర‌భుత్వం మొండిగా ప‌ది గ్రామాల్లో భూ సేక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్నీ త‌ప్పుప‌డుతున్నారాయ‌న‌. అందుకే స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ ర‌ద్దు చేసుకుని మ‌రీ! హైద్రాబాద్ వ‌చ్చేశారు. త్వ‌ర‌లోనే గుంటూరు ప‌ర్య‌ట‌న ఉండ‌బోతోంద‌ని కూడా.. తెలుస్తోంది.
మ‌రోవైపు.. మరో రెండు రోజుల్లో బాబు-పవన్ కలవనున్నారు. భూసేక‌ర‌ణ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో కూడా వివ‌రించ‌నున్నారు. ఆ స‌మావేశం త‌రువాత ప‌వ‌న్ స్టాండ్ మారుతుంద‌ని కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. జ‌న‌సేనాని త‌మ దారికి త‌ప్ప‌క వ‌స్తాడ‌ని ఆశాభావంతో ఉన్నారు.

No comments:

Post a Comment