Sunday, 3 January 2016

కిందపడ్డ రోజా…అరెస్ట్ చేసిన పోలీసులు

0444541011

వైకాపా ఎమ్మెల్యే రోజా స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం మూడో రోజు అసెంబ్లీని ఓ కుదుపు కుదిపింది. శ‌నివారం మూడో రోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో పెద్ద హైడ్రామా న‌డిచింది. రోజా అసెంబ్లీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆమెకు లోప‌ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకున్నారు. అనంత‌రం ఆమెకు పోలీసుల‌కు తీవ్ర‌స్థాయిలో వాగ్వివాదం జ‌రిగింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి నాంప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలోనే ఆమె కింద‌ప‌డిపోవ‌డంతో ఆమె కాళ్ల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.
ముందుగా స‌భ ప్రారంభం కాగానే వైకాపా అధినేత జ‌గ‌న్ మాట్లాడుతూ రోజాపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. లోపల అసెంబ్లీ జ‌రుగుతుండ‌గానే బ‌య‌ట రోజాను పోలీసులు అరెస్టు చేశార‌న్న విష‌యం తెలుసుకున్న వైకాపా అధినేత జ‌గ‌న్ నాంప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఆమెను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నా రోజాను అరెస్టు చేస్తారా.. ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆయన మండిపడ్డారు. నాంప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో రోజా స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌డంతో పోలీసులు ఆమెను నిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నిమ్స్‌లో వైద్య ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు ఆమె సుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోయిన‌ట్టు చెప్పారు.
please share it..

No comments:

Post a Comment