Sunday 3 January 2016

చేసేది మన రజనీ కాదు, అంతా డూపే!

454050520

60 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ హీరో, యంగ్ హీరోలా డ్యాన్స్ లు వేయాలన్నా, ఫైట్స్ చేయాలన్నా, శత్రువులతో విరోచిత విన్యాసాలు చేయలన్నా, హీరోయిన్స్ తో వేగంగా డ్యాన్స్ చేయలన్నా కష్టమే. ఒక వేళ సినమాల్లో ఇవన్నీ చేసినా అది సినిమాటిక్ ప్రకారం బాగానే ఉంటుంది కాని, ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ హీరోగారు ప్రాక్టికల్ గా ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు. ప్రస్తుతం అలాంటి ఇబ్బుదులనే ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదుర్కుంటున్నారు. ప్రతి సంవత్సరం తనకి వయస్సు పెరుగుతుంది కానీ, ఆ స్టైల్ లో మాత్రం వన్నె తగ్గటం లేదు. అలాగే యంగ్ హీరోస్ కంటే ఫుల్ బిజిగా ఉన్న స్టార్ లలో సైతం ఈ సూపర్ స్టారే అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రాలలో ఓరిజినాలిటి కనిపించటం లేదు. ఇందుకు రోబో2, కబలి చిత్రాలు ఉదాహరణగా నిలవనున్నాయి. ఈ రెండు చిత్రాల షూటింగ్ సమయంలో రజనీకాంత్ పనిచేసే సమయం తక్కువనే అంటున్నారు. ఇక ఈ రెండు చిత్రాల్లోనూ పోరాట సన్నివేశాలు ఎక్కువుగా ఉండటంతో రజనీకాంత్ వాటిని చేయలేకపోతున్నాడంట. దీంతో డైరెక్టర్స్ రజనీకాంత్ కి రిస్క్ అనిపిస్తున్న షాట్స్ అన్నింటికి దాదాపు డూప్స్ తోనూ, గ్రాఫిక్స్ తోనూ కవర్ చేస్తున్నారు. ఇక మూవీలో రజనీకాంత్ ని టాకీ పార్ట్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. యాక్షన్, స్టంట్స్, రిస్కీ షాట్స్, వంటి వాటికి రజనీ పూర్తిగా దూరం ఉంటున్నాడంట. మొత్తంగా రజనీకాంత్ తన అప్ కమింగ్ మూవీలలో డూప్ లతోనే పని కానిచ్చేస్తున్నాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ జనవరి 1 నుంచి కబాలి షూట్ ని జరుపుకుంటున్నాడు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ చేస్తుంది.
please share it..

No comments:

Post a Comment