Sunday, 3 January 2016

నకిలీ పోలీసులుగా ‘ఎర్ర’దొంగలు

560560230

గత పుష్కరకాలంలో రూ.25 వేల కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసిన స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా సఫలమైందనే చెప్పాలి. గతేడాది కేవలం వంద కోట్ల లోపు మాత్రమే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ప్రకటించిన ప్రభుత్వం… ఈ ఏడాది మరింతగా దాన్ని కట్టడి చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే… ప్రభుత్వం, అటవీశాఖ కళ్లుగప్పి ఎర్ర సంపదను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చేపను పెద్ద చేప తిన్నట్టు… అడవుల్లో కూలీల ఎత్తుకెళ్తున్న ఎర్ర చందనాన్ని పోలీసు వేషాల్లో వచ్చి స్మగ్లర్లు కాజేయడం పోలీసులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా పోలీస్ గెటప్పులు, అచ్చమైన పోలీసు వాహనాలతో కూడిన సెటప్పులతో దారికాస్తున్న స్మగ్లర్లు… ఎర్రచందాన్ని ఎత్తుకెళుతున్నారు. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, కార్వేటినగరం పరిసరాల్లో ఏకంగా రెండు మూడు పోలీసు వాహనాల్లో వచ్చిన నకిలీ పోలీసులు… ఎర్రచందాన్ని రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నించారు. అప్పటికే కొందరు అటవీశాఖ అధికారులు… అసలు పోలీసులు వారిని గమనించి వెంబడించడంతో నకిలీ పోలీసులు అక్కడి నుంచి పారరైపోయారు. మొత్తానికి… ఖరీదైన ఎర్రచందనాన్ని ఎగరేసుకపోవడానికి స్మగ్లర్లు నకిలీ పోలీసులుగా మారడం చూస్తుంటే… రెడ్ సాండల్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
please share it..

No comments:

Post a Comment